అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : ఇప్పటికే రూ. లక్ష మార్క్‌ను దాటిన బంగారం ధరలు మరింత పెరిగాయి. జులై 22, 2025న బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ. 130 పెరిగి రూ. 1,00,160 కాగా.. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ. 91,810గా నమోదయ్యాయి.
ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి పెరిగిన డిమాండ్. డాలర్ Dollar విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం ప్రభావం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అంశాలే ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. బంగారం ధరలు దిగొస్తాయని ఆశిస్తున్న క్రమంలో ఊహించని రీతిలో ఇలా బంగారం ధరలు పెరగడం గమనార్హం.
Today Gold Price | పెరుగుతూ పోతున్న ధరలు..
పలు నగరాల్లో బంగారం Gold ధరలు చూస్తే.. ( 24 క్యారెట్లు (రూ.), 22 క్యారెట్లు (రూ.)) ప్రకారం..
- హైదరాబాద్ (Hyderabad) లో రూ. 1,00,160 – రూ. 91,810
- విజయవాడ (Vijayawada) లో రూ. 1,00,160 – రూ. 91,810
- ఢిల్లీ (Delhi) లో రూ. 1,00,310 – రూ. 91,960
- ముంబయి (Mumbai) లో రూ. 1,00,160 – రూ. 91,810
- చెన్నై (Chennai) లో రూ. 1,00,160 – రూ. 91,810
- కోల్‌కతా (Kolkata) లో రూ. 99,510 – రూ. 91,230
- బెంగళూరు (Bengaluru) లో రూ. 1,00,160 – రూ. 91,810
- కేరళ (Kerala) లో రూ. 1,00,160 – రూ. 91,810
- పుణే (Pune) లో రూ. 1,00,160 – రూ. 91,810
- అహ్మదాబాద్ (Ahmedabad) లో రూ. 1,00,210 – రూ. 91,860
ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. పలు నగరాలలో కిలో వెండి ధర (₹) ఎలా ఉంది అంటే..
హైదరాబాద్ రూ. 1,25,900, విజయవాడ రూ. 1,25,900, ఢిల్లీ రూ. 1,15,900, ముంబయి రూ. 1,15,900, చెన్నై రూ.1,25,900, కోల్‌కతా రూ. 1,15,900, బెంగళూరు రూ. 1,15,900, కేరళ రూ. 1,25,900, పుణే రూ.1,15,900, అహ్మదాబాద్ రూ. 1,15,900గా ఉన్నాయి.
ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3350 డాలర్ల దిగువన ట్రేడ్ కాగా, అది ఇప్పుడు 3400 డాలర్ల స్థాయికి ఎగబాకడంతో అంతా కంగుతిన్నారు. ఇదే సమయంలో సిల్వర్ Silver రేటు 38.89 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. ఇంకా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.28 వద్ద ట్రేడవుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.