ePaper
More
    Homeక్రీడలుHarbhajan Singh | నువ్వు మా నాన్న‌ని కొట్టావు.. నీతో మాట్లాడ‌న‌ని అన్న శ్రీశాంత్ కుమార్తె

    Harbhajan Singh | నువ్వు మా నాన్న‌ని కొట్టావు.. నీతో మాట్లాడ‌న‌ని అన్న శ్రీశాంత్ కుమార్తె

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Harbhajan Singh | 2008 ఐపీఎల్ తొలి సీజన్ వివాదానికి నిలయంగా మారిన విష‌యం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ త‌ర‌పున‌ ఆడుతున్న హర్భజన్ సింగ్ .. కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్‌(Sreeshanth)తో గొడ‌వ ప‌డ‌గా, ఆ ఘ‌ర్ష‌ణ అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హర్భజన్ శ్రీశాంత్ చెంపపై కొట్టిన ఘటన ఇప్పటికీ క్రికెట్ అభిమానులకి గుర్తుండే సంఘటనగా నిలిచింది. 17 ఏళ్ల తరువాత హర్భజన్(Harbhajan Singh) ఈ అంశాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆర్.అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన హర్భజన్, ఈ సంఘటనపై పశ్చాత్తాపంతో కూడిన‌ వ్యాఖ్యలు చేశారు. “నా జీవితంలో ఏదైనా ఒక్క మార్పు చేసుకునే అవకాశం వస్తే… అది శ్రీశాంత్‌తో జరిగిన సంఘటనే. దానిని తొలగించుకుంటా. అది నా తప్పే. అలాంటి తీరు అవసరం లేదు. అలా చేయకూడదు అని అప్పుడే తెలుసుకోవాల్సింది.

    READ ALSO  Chess World Cup | రెండు ద‌శాబ్దాల‌ త‌ర్వాత తొలిసారి.. ఇండియాలో చెస్ ప్రపంచక‌ప్‌ పోటీలు

    Harbhajan Singh | ఆ బాధ ఇప్ప‌టికీ ఉంది..

    అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పానో నాకే గుర్తు లేదు. 200 సార్లైనా చెప్పి ఉంటాను. కానీ ఆ మచ్చ మాత్రం మనసులో నుంచి మాయంకావడం లేదు అని హర్భజన్ అన్నారు. ఈ సంఘటనను మరవలేకపోతున్నట్టు చెబుతూ, హర్భజన్ తన మనస్సులో ఎంత బాధ ఉందో వెల్లడించారు. శ్రీశాంత్ కుమార్తెను కలిసిన ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ, తను ఎదుర్కొన్న వేదనను షేర్ చేసుకున్నారు. ఆ ఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత శ్రీశాంత్ కుమార్తెను ఓ కార్యక్రమంలో కలిశాను. ఆమెతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని అనుకున్నా. కానీ ఆమె మాత్రం.. ‘నువ్వు మా నాన్నని కొట్టావు.. నేను నిన్ను ఇష్టపడటం లేదు’ అని చెప్పింది. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి.

    READ ALSO  ICC | ఒలింపిక్స్‌లో ఇండియా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వ‌నుందా.. హైబ్రిడ్ మోడ‌ల్‌లో ఎన్ని జ‌ట్లకు అనుమ‌తి?

    ఆ స‌మ‌యంలో నా కళ్లలో నీళ్ళు వచ్చాయి. నేను చేసిన త‌ప్పు మళ్లీ గుర్తుకు వచ్చింది అని భావోద్వేగంగా చెప్పాడు. ఆ చిన్నారి మ‌న‌సు గెలుచుకోవడానికి నేను ఏం చేయ‌గ‌ల‌ను అని నాలో నేను ప్ర‌శ్నించుకున్నాను. నేను త‌న‌కి ఎప్పుడు మ‌ద్ద‌తుగా ఉంటాను. నాపై ఆమె అభిప్రాయం మారాలి. అలాంటి వ్య‌క్తిని కాద‌ని, నేను చేసిన త‌ప్పు తెలుసుకున్నాను అని నిరూపించుకోవ‌డానికి ఏమైన చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాను. తాను పెద్ద‌య్యాక కూడా అలాంటి అభిప్రాయంతో ఉండ‌కూడదు అని నేను కోరుకుంటున్నాను. నా జీవితంలో అత్యంత చేదు అనుభవం ఇది. దాన్ని నా కెరీర్‌ నుంచి పూర్తిగా తీసేయాలని కోరుకుంటున్నానంటూ హ‌ర్భ‌జ‌న్ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడ‌. అయితే శ్రీశాంత్ కుమార్తె ఈ మాటలు ఎప్పుడు అన్నది, ఆ సందర్భం ఏంటి అనే వివరాలను మాత్రం హర్భజన్ వెల్లడించలేదు.

    READ ALSO  Luke Hollman | ల‌గాన్ షాట్‌ని దింపేశాడుగా.. ఈ షాట్ చూస్తే ప‌డిప‌డి న‌వ్వుకుంటారు..!

    Latest articles

    Kamareddy | భార్యపై కోపం.. మొదటి భర్త కూతురి హత్యకు ప్లాన్.. కిడ్నాప్ చేసి దొరికిపోయిన భర్త

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : రెండో పెళ్లి చేసుకున్న భార్యపై ఉన్న కోపాన్ని ఆమె మొదటి భర్తకు...

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో...

    More like this

    Kamareddy | భార్యపై కోపం.. మొదటి భర్త కూతురి హత్యకు ప్లాన్.. కిడ్నాప్ చేసి దొరికిపోయిన భర్త

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : రెండో పెళ్లి చేసుకున్న భార్యపై ఉన్న కోపాన్ని ఆమె మొదటి భర్తకు...

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...