అక్షరటుడే, వెబ్‌డెస్క్:IPO | మెయిన్ బోర్డు(Main board) నుంచి వచ్చిన మరో ఐపీవో ఆదరగొట్టింది. ఇన్వెస్టర్లకు లిస్టింగ్ సమయం లోనే సుమారు 27 శాతం లాభలను అందించింది.
మార్కెట్ నుంచి రూ. 3,395 కోట్లు సమీకరించేందుకు ఆంథెమ్ బయోసైస్సెస్(Anthem Biosciences) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(IPO) కు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరుకు(Bangalore) చెందిన ఈ కంపెనీ సీఆర్‌డీఎం(కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్) రంగంలో సేవలందిస్తోంది. డ్రగ్ డిస్కవరీ(Drug Discovery), డెవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కలిగిన పూర్తి సమగ్ర కార్యకలాపాలతో కూడిన టెక్నాలజీ ఫోకస్డ్(Technology Focused) కంపెనీ ఇది. ఐపీవో గత సోమవారం ప్రారంభమైంది. సబ్స్క్రిప్షన్ గడువు బుధవారంతో ముగిసింది.
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు(Equity Share)ను రూ. 570 కి విక్రయించింది. ఈ ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మంచి స్పందన లభించింది. రిటైల్ కోటా దాదాపు 6 టైమ్స్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు సోమవారం రూ. 723 వద్ద లిస్ట్ అయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయిన వారికి తొలిరోజే 26.85 శాతం లాభాలు వచ్చాయన్న మాట. షేర్ ధర రూ. 730 వద్ద నిలకడగా ట్రేడ్ అవుతోంది.