అక్షరటుడే, వెబ్‌డెస్క్: Typhoon Wipha Storm | చైనా(China)లో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. టైఫూన్ విఫా తుపాన్ ధాటికి దక్షిణ చైనా తీరంలోని హైనాన్ ద్వీపం గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో (Hainan Island Guangdong Province) తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో 140 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ఇప్పటికే 400కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. గాలులు వేగంగా వీస్తుండడంతో విమాన సర్వీసులను (Airline Services) నిలిపి వేశారు.
టైఫూన్ విఫా (Typhoon Wipha) ఆదివారం హాంకాంగ్‌ను తాకాగా.. సోమవారం చైనాలోని దక్షిణ ప్రాంతాలను తాకింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్జీ, హైనాన్, ఫుజియాన్ వంటి తీరప్రాంతాల్లో మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేగంగా ఈదురు గాలులు వీస్తుండటంతో వేలాది చెట్లు నేలకూలాయి.
Typhoon Wipha Storm | హాంకాంగ్‌లో అత్యవసర పరిస్థితి
తుపాన్ మొదట హాంకాంగ్ దేశాన్ని తాకింది. దీంతో ఆదివారం నుంచే ఆ దేశంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతో హాంకాంగ్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు టీ10 ప్రమాద హెచ్చరిక సిగ్నల్ జారీ చేశారు. పాఠశాలలు, వ్యాపారాలు మూసివేసి హాంకాంగ్ ప్రభుత్వం (Hong Kong Government) అత్యవసర పరిస్థితి ప్రకటించింది. గంటకు 160 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో 400 విమానాలు రద్దు చేశారు. నిరాశ్రయులైన వేలాది మందికి సహాయ కేంద్రాలలో ఆశ్రయం కల్పిస్తున్నారు.