అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం ధరలు (Gold rates) నిన్న లక్ష మార్క్ చేరుకోవడంతో వినియోగదారులు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ రోజు బంగారం, వెండి ధరలు కొంతమేర తగ్గిపోవడంతో కొనుగోలు చేసేందుకు చూస్తున్న వారికి ఇది ఒక ఊరటగా మారింది.
జులై 21 బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. బంగారం ధరలు (10 గ్రాములకు) 24 క్యారెట్లు – రూ.1,00,030 కాగా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,690గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే రూ.10 తగ్గుదల నమోదైంది.
ధరల తగ్గుదల చిన్నదైనా, భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. అయితే, సామాన్య వినియోగదారులు మాత్రం లక్షకు చేరిన బంగారం ధరలపై కొంత అయోమయంలో ఉన్నారు.
Today Gold Price : ధరలు ఎలా ఉన్నాయి..
నగరాల వారీగా బంగారం ధరలు (24 క్యారెట్లు (₹), 22 క్యారెట్లు (₹)) పరంగా చూస్తే..
- చెన్నైలో (Chennai) రూ. 1,00,030 – రూ. 91,690 గా ట్రేడ్ అయింది.
- ముంబైలో (Mumbai) రూ. 1,00,030 – రూ. 91,690
- ఢిల్లీలో (Delhi) రూ. 1,00,180 – రూ. 91,840
- కోల్‌కతాలో (Kolkata) రూ. 1,00,030 – రూ. 91,690
- బెంగళూరులో (Bengaluru) రూ. 1,00,030 – రూ. 91,690
- హైదరాబాద్ లో (Hyderabad) రూ. 1,00,030 – రూ. 91,690
- విజయవాడలో (Vijayawada) రూ. 1,00,030 – రూ. 91,690
- విశాఖపట్నంలో (Visakhapatnam) రూ. 1,00,030 – రూ. 91,690 గా ఉన్నాయి.
- ఇక నేటి వెండి ధరలు విషయానికి వస్తే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. నిన్న కిలో వెండి ధర రూ.1,16,000 కాగా, ఈ రోజు రూ.100 తగ్గి రూ.1,15,900కి చేరింది.
నగరాల వారీగా వెండి ధరలు (Sliver price) (కిలోకు) చూస్తే.. ముంబయిలో Mumbai రూ. 1,15,900 కాగా.. ఢిల్లీలో రూ. 1,15,900 , హైదరాబాద్లో రూ. 1,25,900 , విజయవాడలో రూ. 1,25,900 , విశాఖపట్నంలో రూ. 1,25,900 , చెన్నైలో రూ. 1,25,900 , కోల్‌కతాలో రూ. 1,15,900 , బెంగళూరులో రూ. 1,15,900 గా ట్రేడ్ అయింది.
ఈ రోజు బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల ఉండటంతో, ఆసక్తి ఉన్న కొనుగోలుదారులకు ఇది ఒక మంచి అవకాశం కావచ్చు. అయితే, ధరలు ఎప్పుడైనా మారవచ్చని గుర్తుంచుకుని, పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.