అక్షరటుడే, బాన్సువాడ: RTC Tour Package | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (joint Nizamabad district) ఆర్టీసీ అధికారులు ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బాన్సువాడ, ఆర్మూర్ డిపోలను గత కొన్ని నెలలుగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడులోని (Maharashtra and Tamil Nadu) పలు ప్రముఖ దైవ క్షేత్రాలను స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
RTC Tour Package | 27న బాన్సువాడ నుంచి..
తమిళనాడులోని ప్రముఖ ఆలయాల తీర్థ యాత్రకు ఈనెల 27న బాన్సువాడ నుంచి ఆర్టీసీ టూర్ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. 27న మధ్యాహ్నం మూడు గంటలకు బాన్సువాడ నుంచి బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. కాణిపాకం – అరుణాచలం గిరి ప్రదర్శన, అనంతరం గోల్డెన్ టెంపుల్ (Golden Temple) దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 30న రాత్రి 12 గంటల వరకు బాన్సువాడకు (Banswada) తిరిగి చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 5100, పిల్లలకు రూ. 2600 ఉందని, బుకింగ్ కోసం గోపి కృష్ణ 9063408477 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆమె కోరారు.