ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | అన్నదాత భూమి కబ్జా.. ఆందోళనతో ఆత్మహత్య

    Kamareddy | అన్నదాత భూమి కబ్జా.. ఆందోళనతో ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కబ్జాకు గురైన తన భూమి తిరిగి దక్కుతుందో లేదోనని బెంగతో కామారెడ్డి జిల్లాలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన 26 గుంటల భూమి ఓ ముగ్గురు వ్యక్తుల కబ్జాలో ఉందని.. తన ఆత్మహత్యకు వారే కారణమని పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

    కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డికి 26 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల చుట్టూ తిరగ్గా సర్వే అధికారులు వచ్చి ఆ భూమి ముగ్గురి వ్యక్తుల కబ్జాలో ఉందని తేల్చారు. అయితే ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నట్టు సమాచారం. భూమి కబ్జా కావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఆ రైతును వేధించసాగాయి. దీంతో తన భూమి దక్కుతుందో లేదోనన్న భయంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు తన చావు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్​లో రాసి తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Dog Bite | మద్నూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం..తొమ్మిది మందికి గాయాలు

    Latest articles

    Kamareddy | భార్యపై కోపం.. మొదటి భర్త కూతురి హత్యకు ప్లాన్.. కిడ్నాప్ చేసి దొరికిపోయిన భర్త

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : రెండో పెళ్లి చేసుకున్న భార్యపై ఉన్న కోపాన్ని ఆమె మొదటి భర్తకు...

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో...

    More like this