అక్షరటుడే, వెబ్‌డెస్క్: ICICI bank | ప్రైవేటు రంగంలోని దిగ్గజ బ్యాంక్‌లైన హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), యాక్సిస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచినా.. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI bank) మాత్రం అదరగొట్టింది.
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ (Second largest private sector bank) అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం(Net profit) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 15.45 శాతం వృద్ధి చెంది రూ. 13,558 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 11,696 కోట్లుగా ఉంది. స్టాండలోన్ పద్ధతిలో నికర లాభం రూ. 11,059 కోట్ల నుంచి 15.5 శాతం పెరిగి రూ. 12,768 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం(Net interest revenue) 10.6 శాతం వృద్ధితో రూ. 21,635 కోట్లకు పెరిగింది. వడ్డీ మార్జిన్లు 4.41 శాతం నుంచి 4.34 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు గతేడాది రూ. 1.332 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది రూ. 1,815 కోట్లకు పెరిగాయి. మొదటి క్వార్టర్‌లో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.15 శాతం నుంచి 1.67 శాతానికి తగ్గాయి. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తుల(NPA) నిష్పత్తి మొదటి త్రైమాసికంలో 0.43 శాతంనుంచి 0.41 శాతానికి తగ్గింది.
ICICI bank | డిపాజిట్లు..
జూన్ చివరి నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు(Deposits) 12.8 శాతం పెరిగి రూ. 16.08 లక్షల కోట్లకు చేరాయి. సగటు కరెంట్ ఖాతా డిపాజిట్లు 11.2 శాతం, సగటు సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 7.6 శాతం వృద్ధి చెందాయి.
ICICI bank | బ్యాలెన్స్ షీట్..
జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం మూలధనం, అప్పులు రూ. 21.23 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 18.92 లక్షల కోట్లు.
ICICI bank | అడ్వాన్స్‌లు..
బ్యాంక్ మొత్తం అడ్వాన్స్(Advances)లు Q1లో 11 శాతం పెరిగి రూ. 13.64 లక్షల కోట్లకు చేరాయి. రిటైల్ అడ్వాన్స్‌లు, బ్యాంక్ మొత్తం క్రెడిట్ పోర్ట్‌ఫోలియోలో సుమారు 52 శాతంగా ఉన్నాయి. 6.9 శాతం వృద్ధి నమోదయ్యింది. బిజినెస్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియో 29.7 శాతం వృద్ధి చెందగా.. గ్రామీణ క్రెడిట్ పోర్ట్‌ఫోలియో 0.4 శాతం తగ్గింది. Q1 ఫలితాల తర్వాత ఐసీఐసీఐ షేరు విలువ 0.5 శాతం పెరిగి రూ. 1,425.80 వద్ద నిలిచింది.