అక్షరటుడే, వెబ్‌డెస్క్ : National Highways | రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ రానుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జాతీయ రహదారుల పనులు సాగుతుండగా.. కేంద్ర ప్రభుత్వం (central government) మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 15 జాతీయ రహదారులను (national highways) నాలుగు వరుసలుగా విస్తరించడానికి ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం 1,123 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రోడ్లు త్వరలోనే నాలుగు వరుసలుగా మారనున్నాయి.
National Highways | అధిక రద్దీ ఉన్న మార్గాల్లో..
రాష్ట్రంలో అధిక రద్దీ ఉన్న మార్గాల్లో జాతీయ రహదారులను విస్తరించనున్నారు. తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలను (highways and expressways) కనెక్ట్ చేయటం కోసం ఈ విస్తరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్ల విస్తరణకు రూ.39,690 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. రోడ్ల విస్తరణ కోసం భూ సేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తే పనులు ప్రారంభిస్తారు.
National Highways | 2028 నాటికి పూర్తి చేసేలా..
జాతీయ రహదారులను విస్తరించి ఆయా మార్గాల్లో టోల్ ప్లాజాలను (toll plazas) ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 15 రోడ్ల విస్తరణ పనులను 2028 లోగా పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.
National Highways | పెరగనున్న ధరలు
ప్రస్తుతం జాతీయ రహదారులను విస్తరిస్తే ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. రోడ్లు అభివృద్ధి చెందితే భూములకు డిమాండ్ వస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ (real estate) కూడా పుంజుకునే ఛాన్స్ ఉంది. కాగా ఈ రోడ్లలో NH-167లోని జడ్చర్ల నుంచి కోదాడ వరకు 219 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా మార్చనున్నారు. రాష్ట్రంలో ఇదే పెద్ద ప్రాజెక్ట్. ఈ మార్గంలో రద్దీ అధికంగా ఉంటుంది. ప్రస్తుం రెండు వరుసలుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
National Highways | విస్తరించనున్న రోడ్లు
- ఎన్హెచ్-63 : బోధన్ – నిజామాబాద్ సెక్షన్ 36 కిలో మీటర్ల మేర విస్తరించనున్నారు. ఈ మార్గంలో మైనర్ బ్రిడ్జిల విస్తరణతో పాటు, ఆర్వోబీల నిర్మాణం చేపట్టనున్నారు.
- ఎన్హెచ్-163 : హైదరాబాద్ – భూపాలపట్నం మార్గంలో రెండు బ్రిడ్జిలు, 26 కిలోమీటర్ల రోడ్డును విస్తరిస్తారు.
- ఎన్హెచ్-167: జడ్చర్ల నుంచి కోదాడ వరకు 219 కి.మీ. నాలుగు లేన్లుగా మార్పు
- ఎన్హెచ్–30 : విజయవాడ – జగదల్‌పూర్ మార్గంలో రుద్రంపూర్ – భద్రాచలం వరకు రోడ్డు విస్తరిస్తారు. కొత్తగూడెం– పాల్వంచలో బైపాస్ రోడ్డు వేస్తారు.
- ఎన్హెచ్–765డీ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు 63 కి.మీ విస్తరిస్తారు. అలాగే మెదక్ పట్టణం సమీపంలో బైపాస్ రోడ్డు వేస్తారు.
- ఎన్హెచ్–353సీ: పరకాల బైపాస్, భూపాలపల్లి బైపాస్ వరకు 61 కి.మీ నాలుగు లేన్లుగా మారుస్తారు.
- ఎన్హెచ్–6 1: కల్యాణ్ – నిర్మల్ మార్గంలో 53 కి.మీ. విస్తరణ.
- ఎన్హెచ్-365 : నకిరేకల్ – తానంచర్ల వరకు రోడ్డు విస్తరణ, నర్సంపేట బైపాస్ నిర్మాణం చేపడుతారు.
- ఎన్హెచ్-563 : ఖమ్మం – వరంగల్ మార్గంలో 119 కి.మీ మేర రోడ్డు విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.
- ఎన్హెచ్-63 : నిజామాబాద్ – జగదల్‌పూర్ సెక్షన్లో రోడ్డు విస్తరణతో పాటు ఒక మేజర్ వంతెన నిర్మించనున్నారు.
- ఎన్హెచ్-365 : సూర్యాపేట – జనగామ మార్గంలో రోడ్డు విస్తరణ.
- ఎన్హెచ్-365బి బి : ఖమ్మం – సత్తుపల్లి రూట్లో 81 కి.మీ రోడ్డును విస్తరిస్తారు.
- ఎన్హెచ్-163: మన్నెగూడ – రావులపల్లి సెక్షన్లో 73 కి.మీ. రోడ్డును నాలుగు లేన్లుగా మారుస్తారు.
- ఎన్హెచ్-167 : 11 కిలో మీటర్ల మేర మహబూబ్‌నగర్ బైపాస్ నిర్మిస్తారు.