ePaper
More
    Homeక్రీడలుICC | ఒలింపిక్స్‌లో ఇండియా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వ‌నుందా.. హైబ్రిడ్ మోడ‌ల్‌లో ఎన్ని జ‌ట్లకు అనుమ‌తి?

    ICC | ఒలింపిక్స్‌లో ఇండియా డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వ‌నుందా.. హైబ్రిడ్ మోడ‌ల్‌లో ఎన్ని జ‌ట్లకు అనుమ‌తి?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ICC | 2028లో లాస్ ఏంజిల్స్‌లో (Los Angeles) జరుగనున్న ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే అమెరికాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుండి తాత్కాలిక ఊరట లభించింది. అమెరికా క్రికెట్‌లో (American cricket) నెలకొన్న అంతర్గత విభేదాలపై స్పందించిన ఐసీసీ… సమస్యలను పరిష్కరించేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది.

    సింగపూర్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో, జై షా (Jay Shah) నేతృత్వంలోని సభ్యులు ప్రత్యేకంగా యుఎస్‌ఏ క్రికెట్ (USAC) అంశంపై చర్చించారు. ఇప్పటికే ఏడాది కాలంగా అమెరికా క్రికెట్‌లో పాలనాపరమైన సంక్షోభం కొనసాగుతుండగా, దీనిపై గతంలోనూ ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో ఇప్పుడు స్పష్టమైన అల్టిమేటం ఇచ్చింది.

    ICC | ఐసీసీ సూచ‌న‌..

    ఇంకా మూడు నెలల్లోగా USAC అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే, ICC తదుపరి చర్యలకు సిద్ధమవుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు, హైబ్రిడ్ మోడల్‌ ప్రకారం ఎన్ని జట్లను ఒలింపిక్స్‌కు అనుమతించాలన్నదానిపై కూడా ఈ గడువు అనంతరం తుది నిర్ణయం తీసుకోనుంది.

    READ ALSO  Chess World Cup | రెండు ద‌శాబ్దాల‌ త‌ర్వాత తొలిసారి.. ఇండియాలో చెస్ ప్రపంచక‌ప్‌ పోటీలు

    2028లో జరగబోయే ఒలింపిక్స్‌కు (Olympics) ఆతిథ్య దేశం హోదాలో ఉన్న అమెరికా పురుషులు, మహిళల జట్లు నేరుగా అర్హత పొందనున్నాయి. అయితే ఈ జట్ల కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? అన్నది ఇంకా స్పష్టత లేని అంశం. దీనివల్లే, ICCతో పాటు అమెరికా క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు.

    2024 జూన్‌లో అమెరికాను సందర్శించిన ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ, అక్కడ పరిస్థితులు ఆశాజనకంగా లేవని నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా జూలై సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ICC ఇచ్చిన మూడు నెలల గడువుతో USAC తన మేనేజ్‌మెంట్‌లో ఏ మార్పులు చేస్తుందో, ప్లేయర్ సెలెక్షన్‌లో ఎలాంటి పారదర్శకత తీసుకువ‌స్తుందో చూడాలి. ఒలింపిక్స్‌లో హైబ్రిడ్ మోడ‌ల్‌ అమ‌లు చేస్తే.. టీ 20 ర్యాంకింగ్స్​ (ICC T20 rankings) ఆధారంగా కొన్ని జ‌ట్లు అర్హ‌త సాధిస్తాయి. కొన్ని జ‌ట్లు క్వాలిఫికేష‌న్ మ్యాచ్‌ల‌లో ఆడాల్సి ఉంటుంది. అయితే టాప్‌లో ఉన్న ఇండియా జ‌ట్టు నేరుగా ఒలింపిక్స్‌కి వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ స‌మావేశానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఆదివారం ప్ర‌క‌టించే ఛాన్స్​ ఉంది.

    READ ALSO  Harbhajan Singh | నువ్వు మా నాన్న‌ని కొట్టావు.. నీతో మాట్లాడ‌న‌ని అన్న శ్రీశాంత్ కుమార్తె

    Latest articles

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    More like this

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...