ePaper
More
    HomeతెలంగాణBRS Working President KTR | ఫ్ర‌స్ట్రేష‌న్‌లో కేటీఆర్? అనుచిత వ్యాఖ్య‌లతో అభాసుపాలు

    BRS Working President KTR | ఫ్ర‌స్ట్రేష‌న్‌లో కేటీఆర్? అనుచిత వ్యాఖ్య‌లతో అభాసుపాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS Working President KTR | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఫ్రస్ట్రేష‌న్‌కు గుర‌వుతున్నారా? అందులో భాగంగానే తర‌చూ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం పలువురి నుంచి వినిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వివాదాస్ప‌ద‌మ‌వుతున్నారు.

    ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో (CM Revanth Reddy) పాటు మంత్రులు, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంతేకాదు, త‌మ‌ను ఓడ‌గొట్టిన ప్ర‌జ‌ల‌పైనా ఆయ‌న త‌ప్పుగా మాట్లాడుతున్నారు. బిర్యానీకి ఆశ‌ప‌డి మోస‌పోయార‌ని, ఐదేళ్లు శిక్ష అనుభ‌వించాల్సిందేన‌ని ప్ర‌జా తీర్పును త‌ప్పుబ‌డుతూ చేస్తున్న వ్యాఖ్య‌లు కేటీఆర్‌పై (BRS Working President KTR) విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. అధికారానికి దూరం కావ‌డం, సొంతింట్లోనే ఆధిప‌త్య పోరు పెరిగి పోవ‌డం, కేసులు వెంటాడుతుండ‌డంతో కేటీఆర్ ఫ్ర‌స్ట్రేష‌న్‌కు లోన‌వుతున్నార‌ని, అందుకే అదుపు త‌ప్పి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

    BRS Working President KTR | వివాదాస్పదమవుతున్న వ్యాఖ్య‌లు..

    అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు త‌ర‌చూ వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వంతో పాటు సీఎం, మంత్రులపై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై ప్ర‌జ‌ల్లోనే కాదు, సొంత పార్టీ శ్రేణుల్లోనూ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకుని చేస్తున్న విమ‌ర్శ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. వాడు, వీడు అనడమే కాకుండా అనుచిత పదాలతో వ్యాఖ్యానించ‌డం కేటీఆర్​లోని అసంతృప్తి బయటపడుతోంది.

    READ ALSO  Former MLA Baji Reddy | ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడ్తారా..? మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

    తాజాగా శుక్ర‌వారం ఖ‌మ్మం (Khammam) ప‌ర్య‌ట‌న‌లోనూ కేటీఆర్ సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. 20 నెల‌ల్లో ‘నువ్వు పీకిందేముంది? మీరు పీకేదేమీ లేదు.. నా బొచ్చు త‌ప్ప‌?’ అని వ్యాఖ్యానించ‌డం మ‌రోసారి విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. వ్య‌క్తిగ‌తంగా రేవంత్‌రెడ్డిని విమ‌ర్శించ‌డం వేరు, ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తిని విమ‌ర్శించ‌డం వేర‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌దేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాజ‌భోగాలు అనుభ‌వించిన‌ కేటీఆర్.. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిని ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ గ‌ద్దెనెక్క‌డం, పైగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకించే రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం కేసీఆర్‌తో పాటు కేటీఆర్ త‌ట్టుకోలేకపోతున్నార‌ని రాజ‌కీయ‌, సామాజిక విశ్లేష‌కులు చెబుతున్నారు.

    BRS Working President KTR | వెంటాడుతున్న కేసులు..

    ప‌దేళ్ల బీఆర్ఎస్(BRS) పాల‌న‌లో భారీగా అవినీతి జ‌రిగింది. ఏసీబీ త‌నిఖీల్లో కాళేశ్వ‌రంలో జ‌రిగిన అవినీతి వెలుగులోకి వ‌స్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కూ రూ.వేల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని దోచుకున్న‌ట్లు బ‌య‌ట ప‌డుతోంది. ఇక రెవెన్యూ, ఎక్సైజ్‌స‌హా వివిధ శాఖ‌ల్లోనూ అంతులేని అవినీతి జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే రేవంత్ స‌ర్కారు (Revanth Government) విచార‌ణ‌కు ఆదేశించింది.

    READ ALSO  Padi Kaushik Reddy | ఈటల సీఎం కావాలనుకున్నారు.. పాడి కౌశిక్​రెడ్డి​ సంచలన వ్యాఖ్యలు

    ప్ర‌ధానంగా కాళేశ్వ‌రం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ కార్, ఫోన్ ట్యాపింగ్‌, హెచ్‌సీఏ వ్య‌వ‌హారంపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఆయా అంశాల్లో కేసీఆర్ కుటుంబం వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి. ఇప్ప‌టికే ఫార్ములా ఈ కార్ రేస్ వ్య‌వ‌హారంలో కేటీఆర్ ప‌లుమార్లు విచార‌ణకు హాజ‌ర‌య్యారు.

    ఇక‌, కేసీఆర్‌(KCR), హ‌రీశ్‌రావు కాళేశ్వ‌రం క‌మిష‌న్ (Klaeshwaram Commission) ముందుకు వ‌చ్చి త‌మ వాద‌న చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసీఆర్‌, కేటీఆర్ మెడ‌కు చుట్టుకుంటుద‌న్న ప్రచారం జ‌రుగుతోంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన హెచ్‌సీఏ వ్య‌వ‌హారంలోనూ కేటీఆర్‌, క‌విత(MLC Kavitha) పేర్లే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇలా వ‌రుస‌గా వ‌చ్చి ప‌డుతున్న కేసులు, విచార‌ణ‌ల‌తో ఆందోళ‌న చెందుతున్న కేటీఆర్ ఫ్ర‌స్ట్రేష‌న్‌కు లోన‌వుతున్నార‌ని చెబుతున్నారు.

    BRS Working President KTR | ఆధిప‌త్య పోరుతో స‌త‌మ‌తం..

    అధికారం కోల్పోయామ‌న్న అసంతృప్తితో ర‌గిలిపోతున్న కేటీఆర్‌ను ఆధిప‌త్య పోరు మ‌రింత స‌త‌మ‌తమయ్యేలా చేస్తోంది. సొంత చెల్లెలి నుంచే తీవ్ర పోటీ ఎదుర్కొంటుండ‌డం ఆయ‌న‌ను తీవ్ర అస‌హ‌నానికి గురి చేస్తోంది. సొంతింట్లో నెల‌కొన్న వివాదం ర‌చ్చ‌కెక్క‌డాన్ని ఆయ‌న త‌ట్టుకోలేక పోతున్నారు. క‌విత త‌న‌నే టార్గెట్‌గా చేసి విమ‌ర్శ‌లు చేస్తుండ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేకపోతున్నారు. అటు అధికారం పోవ‌డం, ఇటు ఇంట్లో ఆధిప‌త్య పోరు పెర‌గ‌డం ఫ్ర‌స్ట్రేష‌న్‌లోకి నెట్టేస్తోంది. ఈ నేప‌త్యంలోనే కేటీఆర్ అదుపుత‌ప్పి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

    READ ALSO  Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    Latest articles

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతుంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    More like this

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణమాసంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి Gold ప‌రుగులు పెడుతుంది. త‌గ్గినట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతూ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...