ePaper
More
    HomeజాతీయంToll charges |వాహనదారులకు శుభవార్త.. ఆ మార్గాల్లో టోల్ ఛార్జీలు సగమే..

    Toll charges |వాహనదారులకు శుభవార్త.. ఆ మార్గాల్లో టోల్ ఛార్జీలు సగమే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll charges | జాతీయ రహదారులపై (national highways) ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. ప్రస్తుతం విధిస్తున్న టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పించనుంది.

    అయితే, రహదారుల విస్తరణ సమయంలో మాత్రమే ఇది వర్తించే అవకాశముంది. వాహనాల రద్దీ దృష్ట్యా జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. రెండు వరుసల రహదారిని ఫోర్ లేన్ గా, ఫోర్ లేన్ రోడ్ ను ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. విస్తరణ పనుల సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో టోల్ టాక్స్ నుంచి కొంత మినహాయింపు ఇవ్వాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport) యోచిస్తోంది.

    Toll charges | కొత్త ప్రతిపాదన..

    రహదారుల విస్తరణ సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రోడ్ల నిర్మాణం, విస్తరణ సమయంలో వన్ వేలో మాత్రమే రాకపోకలు అనుమతిస్తారు. దీని వల్ల వాహనదారులకు మెరుగైన సేవ లభించదు. కాబట్టి టోల్ రుసుం నుంచి మినహాయింపు ఇవ్వాలని రోడ్డు రవాణ మంత్రిత్వ శాఖ ఓ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రస్తుతం కొన్ని జాతీయ రహదారుల నిర్మాణాలు (national highways construction) పూర్తి కాకపోయినా టోల్ వసూలు చేస్తున్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, నిర్మాణ సమయంలో హైవేపై ప్రయాణించే వ్యక్తి సాధారణ టోల్ సుంకం నుంచి 30 శాతం వరకు మినహాయింపు లభిస్తుంది. నాలుగు లేన్ల రహదారులను ఆరు లేన్లుగా విస్తరించే లేదా ఆరు లేన్ల రహదారులను ఎనిమిది లేన్లుగా విస్తరించే సందర్భంలో, నిర్మాణ దశలో 75 శాతం మాత్రమే టోల్ వసూలు చేయాలని ప్రతిపాదించారు.

    READ ALSO  Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..?

    కేంద్ర ప్రభుత్వం (central government) వాహనదారులకు ఉపశమనం కలిగించేలా కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రూ. 3,000 వార్షిక టోల్ పాస్ పథకాన్ని (toll pass scheme) ప్రకటించింది. జాతీయ రహదారులపై ఏటా 200 సార్లు ఉచితంగా టోల్ ప్లాజాలను దాటడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇక, వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, హైవేలలోని ఎలివేటెడ్ సెక్షన్ల వంటి నిర్మాణాలకు టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించడానికి ఒక కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. ఇది వాణిజ్య, భారీ వాహనాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

    Latest articles

    MLC Kavitha | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this