అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Chandra babu | జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో(Pahalgam terror జరిగిన ఉగ్రదాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. భారత్‌తో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అయిపోవాల్సిందేనని పేర్కొన్నారు. భారత్‌ను ఉగ్రవాదం ఏం చేయలేదని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.
CM Chandra babu | భవిష్యత్ అంతా ఏఐదే..
స్టార్టప్ కంపెనీల కోసం వి-లాంచ్ పాడ్ 2025ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. అమరావతిలోని విట్ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని hitech City Hyderabad 14 నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. భవిష్యత్ అంతా ఐటీదేనని అపట్లో తాను చెప్పానన్నారు. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు ఐటీ ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. నేనెప్పుడూ భవిష్యత్తు టెక్నాలజీ గురించి మాట్లాడుతానని.. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్లు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులుంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు.
CM Chandra babu | మే 2న ఏపీకి రానున్న ప్రధాని..
మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్నారని సీఎం తెలిపారు. ఆయన చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బ్రహ్మాండంగా నూతన రాజధాని నిర్మించుకుందామని, ఈ వేడుకకు ప్రజలంతా హాజరు కావాలని కోరారు.