అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)లో బలహీనమైన ట్రెండ్ కొనసాగుతోంది. ఐటీ స్టాక్స్‌లో పతనం ఆగడం లేదు. దీంతో ప్రధాన సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 37 పాయింట్ల స్వల్ప లాభంతో, నిఫ్టీ (Nifty) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 82.010 నుంచి 82,537 పాయింట్ల రేంజ్‌లో, నిఫ్టీ 25,001 నుంచి 25,151 పాయింట్ల రేంజ్‌లో కొనసాగాయి. చివరికి సెన్సెక్స్ (Sensex) 247 పాయింట్ల నష్టంతో 82,253 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 25,082 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,054 కంపెనీలు లాభపడగా 2,137 స్టాక్స్ నష్టపోయాయి. 149 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 182 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 57 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 3 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 11 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | ఐటీలో కొనసాగుతున్న పతనం..
ఐటీ స్టాక్స్(IT stocks)లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. హెల్త్‌కేర్, రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ పరుగులు తీశాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 1.07 శాతం పతనమైంది. రియాలిటీ ఇండెక్స్(Realty index) 1.38 శాతం పెరగ్గా.. హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.15 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.88 శాతం, యుటిలిటీ సూచీ 0.77 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.35 శాతం, ఇన్‌ఫ్రా 0.34 శాతం పెరిగాయి. మిడ్ క్యాప్(Midcap) ఇండెక్స్ 0.67 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57 శాతం లాభపడగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం నష్టపోయింది.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు లాభాలతో 20 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. ఎటర్నల్ 2.83 శాతం, టైటాన్ 1.23 శాతం, ఎంఅండ్‌ఎం 0.56 శాతం, సన్‌ఫార్మా 0.54 శాతం, ఐటీసీ 0.54 శాతం లాభాలతో ముగిశాయి.
Top Losers:టెక్ మహీంద్రా 1.55 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.54 శాతం, ఇన్ఫోసిస్ 1.53 శాతం, ఆసియన్ పెయింట్ 1.50 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.41 శాతం నష్టపోయాయి.