అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gurukul School | గురుకుల పాఠశాలల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐదో తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేట (Tupranpet)లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District)కు చెందిన సంధ్య తూప్రాన్‌పేటలోని జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల (Jyotibapule Gurukul School)లో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం పాఠశాలకు తిరిగి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Gurukul School | ప్రభుత్వ వైఫల్యమే కారణం
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యపై మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కార్ (Congress Government) వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. పురుగుల అన్నం తినలేక అవస్థలు పడుతున్న చిన్నారులు, కనీస సౌకర్యాలు లేని హాస్టల్‌లో ఉండలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే గురుకులాల్లో 90 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించినా ముఖ్యమంత్రికి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.