అక్షరటుడే, వెబ్‌డెస్క్: Black Beauty : అందాల సుందరి ఆత్మహత్య చేసుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన పుదుచ్ఛేరికి చెందిన బ్యూటీ బలవన్మరణానికి పాల్పడింది. ప్రపంచ సుందరి మోడల్ శాన్ రేచల్ గాంధీ San Rachel Gandhi అధిక మోతాదులో మాత్రలు వేసుకొని తనువు చాలించింది. ఈ ఘటన ఆదివారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. పుదుచ్చేరి కారామణికుప్పంకు చెందిన మోడల్ శంకర ప్రియ (Model Shankara Priya) అలియాస్ శాన్ రేచల్ (25) మోడల్ రంగంలో రాణించింది. క్యాన్సర్ వల్ల చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయింది రేచల్. ఇక నల్లగా ఉండటంతో మోడల్ రంగంలో చాలామంది ఆమెను దూరంగా పెట్టారు.
కానీ, చర్మం కలర్‌తో సంబంధం లేకుండా.. కేవలం తన ప్రతిభ ఆధారంగా మోడలింగ్‌లో రాణించింది. 2020-21లో మిస్ పాండిచ్చేరిగా (Miss Pondicherry Rachel) రేచల్ ఎంపికైంది. అంతకు ముందు 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు(Miss Dark Queen Tamil Nadu) టైటిల్ కూడా సొంతం చేసుకుంది. అదే సంవత్సరం(2019) మిస్ బెస్ట్ యాటిట్యూడ్తోపాటు ఇతర టైటిల్స్ ని కూడా అందుకుంది.
Black Beauty : బ్లాక్ బ్యాటీ టైటిల్ సొంతం..
బ్లాక్ బ్యూటీ విభాగంలో రేచల్ మిస్ వరల్డ్ టైటిల్ని సైతం అందుకుంది. అయితే, గత కొన్నిరోజులుగా శంకర ప్రియ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఇదే సమస్యతో జిష్మర్లో చికిత్స పొందుతూ వచ్చింది.
కాగా, తన నివాసంలో ఆదివారం అధిక మోతాదులో రక్తపోటు మాత్రలు తీసుకుని తనువు చాలించింది. రేచల్ ఫ్యాషన్ షో సహా పలు కార్యక్రమాలు నిర్వహించేది. ఈ క్రమంలో కలిగిన నష్టాల వల్ల రేచల్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పుదుచ్చేరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.