అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బైపాస్ (Bypass road) నుంచి జీజీ కళాశాల (GG College) వెళ్లే రోడ్డులో చంద్రశేఖర్ కాలనీ (Chandrasekhar Colony) చౌరస్తా వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
మద్యం మత్తులో డ్రైవర్ కారును వేగంగా నడుపుతూ.. రోడ్డు పక్కన టోపీలు విక్రయిస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. అనంతరం ఓ లూనాను కూడా ఢీకొట్టి తర్వాత డ్రెయినేజీ గోడకు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో టోపీలు విక్రయిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.