ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | మ‌గువల‌కు మ‌ళ్లీ షాక్.. రూ.ల‌క్ష‌కు చేరువ‌లో బంగారం ధ‌ర‌

    Today Gold Price | మ‌గువల‌కు మ‌ళ్లీ షాక్.. రూ.ల‌క్ష‌కు చేరువ‌లో బంగారం ధ‌ర‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో మ‌హిళ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కసారిగా లక్ష రూపాయలను తాకింది. ఆ సమయంలో ద్రవ్యోల్బణం భయంతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు.

    కానీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో జూన్ చివర్లో బంగారం ధరలు భారీగా పడిపోయి రూ.94,000 వరకు దిగివచ్చాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలో మ‌ళ్లీ బంగారం ధరలు మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి.

    హైదరాబాద్‌లో నిన్నటి ధరల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 24 carats gold ధర: ₹99,710 కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 22 carats gold ధర: ₹91,400, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర: ₹74,790.

    READ ALSO  Tesla Y SUV | భారత్​లో లాంచ్​ అయిన టెస్లా తొలి ఎలక్ట్రిక్​ కారు ఇదే.. ఫీచర్స్​ అదుర్స్​..

    Today Gold Price : కొనేదెట్టా..

    ఈ ధరలు నేడు కూడా అలాగే కొనసాగుతున్నాయి. అంటే నిన్నటితో పోల్చితే ఎటువంటి మార్పు లేదు. బంగారానికి భిన్నంగా, వెండి ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ఈ రోజు వాటిలో మార్పు లేదు.

    100 గ్రాముల వెండి ధర: ₹12,500, 1 కేజీ వెండి Silver ధర: ₹1,25,000. ఈ ధరలు నిన్నటి లాగే నేడు కూడా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌, డాలర్ మారకపు విలువ, దేశీయ డిమాండ్ ఆధారంగా మారుతూ ఉంటాయి. కొనుగోలు ముందు తాజా ధరలు తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది.

    హైదరాబాద్ hyderabad, విజయవాడ Vijayawada, విశాఖపట్నం Vizag ల‌లో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ Delhi లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం తులం రూ.92,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.97,020గా నమోదైంది.

    READ ALSO  Nvidia | ఆ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 4 లక్షల కోట్ల డాలర్లు.. మన దేశ జీడీపీ కన్నా ఎక్కువ..

    ఇక కోల్‌కతా విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ 22 క్యారెట్ల బంగారం తులం రూ.91,400 కాగా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.99,710గా న‌మోదైంది.. ఇతర నగరాలతో పోలిస్తే 24 క్యారెట్ల ధరలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక చెన్నైలో Chennai 22 క్యారెట్ల బంగారం తులం రూ.90,781ఉండ‌గా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.99,031గా నమోదైంది.

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this