అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arunachalam | తమిళనాడు(Tamilnadu)లోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో నిత్యం వేలాది మంది భక్తులు అరుణాచల క్షేత్రానికి వెళ్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు భక్తులు(Huge Devotees) భారీగా తరలి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)కు వెళ్లిన తెలంగాణ వ్యక్తిని ఇద్దరు తమిళ వ్యక్తులు హత్య చేశారు.
Arunachalam | డబ్బులు ఇవ్వకపోవడంతో..
యాదాద్రి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్(32) గిరి ప్రదక్షిణ నిమిత్తం అరుణాచలం వెళ్లారు. ఆయన గిరి ప్రదక్షిణలో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వాలని కుగణేశ్వరన్(22), తమిళరసన్(25) అనే ఇద్దరు తమిళ వ్యక్తులు(Tamil People) డిమాండ్ చేశారు. అందుకు విద్యాసాగర్ నిరాకరించడంతో కత్తితో దాడి చేసి, గొంతు కోశారు. అనంతరం ఆయన దగ్గర ఉన్న రూ.5 వేలు దోచుకొని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను భక్తులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Arunachalam | తెలుగు భక్తులపై వివక్ష!
అరుణాచల క్షేత్రానికి తెలుగు భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అక్కడి వెళ్లే వారిలో అధికశాతం తెలంగాణ(Telangana), ఏపీకి చెందిన వారే ఉంటారు. తెలుగు ప్రజల మూలంగానే గిరిప్రదక్షిణకు భక్తులు పెరిగారనే భావన కూడా ఉంది. అక్కడ కొంత మంది తెలుగు భక్తులపై వివక్ష చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు పలువురు భక్తులు గతంలో ఆరోపణలు చేశారు.