అక్షరటుడే, వెబ్‌డెస్క్: ED raids | తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భూదాన్ భూముల వ్యవహారంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. పలువురు ఇళ్లలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో భూదాన్ (Bhoodan lands), మహేశ్వరం భూముల వ్యవహారంలో తాజాగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం. భూదాన్ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు వంద ఎకరాల భూములను విక్రయించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు పాతబస్తీలో మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసాలతో పాటు శర్పాన్, సుకుర్ అనే వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అమాయ్ కుమార్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.