అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం Gold ధరలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. తగ్గినట్టే తగ్గి వెంటనే పెరుగుతున్నాయి.
గత ఏప్రిల్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలను తాకి వినియోగదారులకి షాక్ ఇచ్చింది. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల తీవ్రమైన ప్రభావం చూపింది.
అయితే, జూన్ చివరికి బంగారం ధర క్రమంగా తగ్గి రూ.94,000కు చేరడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అది ఎక్కువ కాలం నిలబడలేదు.
ఇప్పుడు మళ్లీ గోల్డ్ ధరలు పెరిగి, రూ.లక్ష వైపు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం (24-carat pure gold) ధర రూ.99,010 (10 గ్రాములకు) వద్ద ట్రేడ్ అవుతోంది.
Today Gold Price : మళ్లీ పెరిగిన బంగారం..
హైదరాబాద్(Hyderabad)లో ఈ రోజు బంగారం ధరలు (10 గ్రాములకు) 24 క్యారెట్లు: ₹99,010 కాగా, 22 క్యారెట్లు: ₹90,760, 18 క్యారెట్లు: ₹74,260గా ఉన్నాయి.
అయితే, నిన్నటి రేటులతో పోలిస్తే, ప్రతి గ్రాముపై ₹1 చొప్పున రూ.10 పెరిగింది. దీంతో వినియోగదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
Today Gold Price : ఇతర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములకు) చూస్తే..
- విశాఖపట్నం Vishakapatnam – ₹98,840,
- రాజమండ్రి – ₹98,730,
- ముంబై – ₹98,730,
- చెన్నై – ₹98,730,
- బెంగళూరు – ₹98,730,
- కోల్‌కతా – ₹98,730,
- ఢిల్లీ – ₹98,880,
- అహ్మదాబాద్ – ₹98,700,
- భువనేశ్వర్ – ₹98,720గా నమోదైంది.
ఇక బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు అంత స్థిరంగా ఉండడం లేదు. ఒక రోజు పెరుగుతుంటే, మరో రోజు తగ్గుతున్నాయి.
నిన్న హైదరాబాద్‌లో Hyderabad 100 గ్రాముల వెండి ధర: ₹12,100గా ఉండగా, కేజీ వెండి ధర: ₹1,21,000గా నమోదైంది. అయితే ఈ రోజు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
100 గ్రాముల వెండి: ₹12,110 కాగా, 1 కేజీ వెండి: ₹1,21,100. అయితే బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలని భావిస్తున్నవారు తొందరపడండి.
లేదంటే ట్రెండ్ అవుతున్న ధరలని బట్టి చూస్తుంటే బంగారం ధరలు తిరిగి లక్ష మార్క్‌ను దాటే అవకాశం కనిపిస్తోంది.