అక్షరటుడే, ఇందూరు: Nizamabad Arya Vaishya Sangam | నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ (President Dhanpal Srinivas), మాణిక్ భవన్ ఉన్నత పాఠశాల అధ్యక్షుడిగా ఇంగు శివప్రసాద్, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షుడిగా పాల్తి రవి, వైశ్య భవన్ (తానా గల్లి) అధ్యక్షుడిగా ఇల్లెందుల సుధాకర్ గెలుపొందారు.
Nizamabad Arya Vaishya Sangam | రసాభాసతో ఆలస్యం…
ఆర్యవైశ్య ఎన్నికలు ఈనెల 6న మాణిక్ భవన్ పాఠశాలలో (Manik Bhavan High School) నిర్వహించారు. అయితే ఎన్నికల్లో గందరగోళం నేపథ్యంలో ఐదు రోజుల తర్వాత లెక్కింపు పూర్తి చేశారు. కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు అంటూ.. ఎన్నికల ఇన్చార్జులకు పరస్పర ఫిర్యాదులు చేశారు. దీంతో కుల పెద్దలు చర్చలు జరిపి ఎట్టకేలకు శుక్రవారం ఓట్ల లెక్కింపు చేసి, గెలుపొందిన వారి పేర్లను ప్రకటించారు. మిగతా కార్యవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని, త్వరలోనే ప్రకటిస్తామని వైశ్య సంఘం ఎన్నికలు ఇన్చార్జిలు తెలిపారు.
Nizamabad Arya Vaishya Sangam | అనుబంధ సంఘాల ఏకగ్రీవం…
ఆర్యవైశ్య సంఘం (Arya Vaishya Sangam) దాని అనుబంధ నాలుగు సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మరో మూడు అనుబంధ సంఘాలను గతంలోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన సంఘం అధ్యక్షుడిగా మాశెట్టి లిఖిత్, నగరేశ్వర దేవాలయం అధ్యక్షుడిగా చెన్న రవీందర్, ఆర్యవైశ్య గ్రాడ్యుయేషన్ సంఘం అధ్యక్షుడిగా నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.