అక్షర టుడే, వెబ్‌డెస్క్: Ura Pandaga | నగరంలో నిర్వహించనున్న ఊర పండుగకు (Ura Pandaga) రావాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను (MLC Balmuri Venkat) సర్వ సమాజ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనను కలిసి ఆహ్వానం పలికారు. దీంతో ఆయన తప్పకుండా హాజరవుతానని చెప్పినట్లు సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు రామ్మూర్తి గంగాధర్, బంటు రాజేశ్వర్, రామడుగు బాలకిషన్, సకినాల శివ తదితరులు పాల్గొన్నారు.
కాగా.. ఊర పండుగను ఈ నెల 13న నిర్వహించనున్నారు. ఊర పండుగను పురస్కరించుకొని నగరంలోని ఖిల్లా చౌరస్తా నుంచి గ్రామదేవతల ఊరేగింపును ప్రారంభించనున్నారు. పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుంది. అలాగే మరో గ్రామ దేవత దుబ్బ వైపు తరలి వెళ్తుంది. సర్వసమాజ్ సభ్యులు, వివిధ కుల సంఘాల సభ్యులు వేడుకలో పాల్గొననున్నారు.