అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో మన మార్కెట్లలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్(Profit booking)కే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వరుసగా మూడో రోజు ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనించాయి. ఎర్నింగ్ సీజన్ బలహీనంగా ప్రారంభమవడం సైతం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)తోపాటు టాటా ఎలెక్సీ, ఐఆర్‌ఈడీఏ గురువారం మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. మూడిరటి ఫలితాలూ నిరాశాజనకంగా ఉండడమూ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్(Trade) అవడానికి ఓ కారణం. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 370 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కొంత కోలుకుని 220 పాయింట్లు పెరిగినా అమ్మకాల ఒత్తిడితో మరో 598 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 35 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి 67 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ఇంట్రాడే గరిష్టాలనుంచి 193 పాయింట్లు పడిపోయింది. చివరికి చివరికి సెన్సెక్స్(Sensex) 689 పాయింట్ల నష్టంతో 82,500 వద్ద, నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 25,149 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,551 కంపెనీలు లాభపడగా 2,453 స్టాక్స్ నష్టపోయాయి. 161 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 133 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 42 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 3 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి
ఎఫ్‌ఎంసీజీ(FMCG), హెల్త్‌కేర్ సెక్టార్లు మినహా మిగతా అన్ని రంగాల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ(IT), ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం, హెల్త్‌కేర్ సూచీ 0.17 శాతం లాభాలతో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ 1.77 శాతం, ఆటో సూచీ(Auto index) 1.72 శాతం నష్టపోగా.. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.28 శాతం, ఎనర్జీ 1.23 శాతం, టెలికాం ఇండెక్స్ 1.22 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.21 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.18 శాతం, పీఎస్‌యూ 0.55 శాతం నష్టపోయాయి. లార్జ్ క్యాప్(Large cap) ఇండెక్స్ 0.82 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.70 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం నష్టాలతో ముగిశాయి.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో 22 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. హెచ్‌యూఎల్ 4.61 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.79 శాతం, సన్‌ఫార్మా 0.56 శాతం, ఎన్టీపీసీ 0.37 శాతం, ఎటర్నల్ 0.19 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Losers:టీసీఎస్ 3.46 శాతం, ఎంఅండ్‌ఎం 2.75 శాతం, ఎయిర్‌టెల్ 2.20 శాతం, టాటా మోటార్స్ 2 శాతం, టైటాన్ 1.73 శాతం నష్టాలతో ఉన్నాయి.