అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లా నుంచి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో (Zonal Police Duty Meet) పాల్గొన్న పోలీసులు రాష్ట్ర జోనల్మీట్లోనూ ప్రతిభ చూపాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. పోలీస్డ్యూటీ మీట్లో జిల్లాపోలీసులు 11 పథకాలు సాధించిన సందర్భంగా శనివారం వారిని ఎస్పీ కార్యాలయంలో అభినందించారు.
SP Rajesh Chandra | పథకాలు సాధించిన వీరే..
ఈనెల 7, 8 తేదీల్లో కరీంనగర్లో (Karimnagar) జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లా తరపున ఆరుగురు పోలీస్ అధికారులు 11 పతకాలు సాధించారు. గాంధారి ఎస్సై ఆంజనేయులు (Gandhari SI Anjaneyulu) 5 పతకాలు సాధించారు. అందులో (3 బంగారు, 2 వెండి పతకాలు) ఉన్నాయి. లిఫ్టింగ్(Lifting), ప్యాకింగ్, ఫింగర్ ప్రింట్స్ ఫార్వర్డ్, నేర స్థల ఫోటోగ్రఫీ (Crime scene photography) విభాగాల్లో బంగారు పతకాలు, విచారణలో శాస్త్రీయ వినియోగం (ఫింగర్ ప్రింట్ మరియు ఫోరెన్సిక్ సైన్స్) విభాగంలో వెండి పతకాలు సాధించారు.
మద్నూర్ ఎస్సై విజయ్ ఫోరెన్సిక్, ఫోటోగ్రఫీ, ఫింగర్ ప్రింట్ సైన్స్ విభాగంలో రెండు వెండి పతకాలనుసాధించారు. బిచ్కుంద కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ దర్యాప్తు (రాత పరీక్ష), పోలీస్ పోర్ట్రెట్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. రాజంపేట కానిస్టేబుల్ చిరంజీవి కంప్యూటర్ అవగాహన విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఏఆర్ విభాగానికి చెందిన రామచంద్రం, ఎల్లారెడ్డిలు విధ్వంసకాల విచ్చిన్నంపై తనిఖీ విభాగంలో ఒక్కో వెండి పతకం సాధించారు.
SP Rajesh Chandra | సిబ్బందిలో వృత్తి నైపుణ్యం మెరుగు
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యం ఉన్న వారిని గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జోనల్ స్థాయిలో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోలీస్ డ్యూటీ మీట్ ఉంటుందని అందులో సైతం ప్రతిభ కనబర్చి జిల్లాకు మెడల్స్ సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాయుధ దళ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.