అక్షరటుడే, బాన్సువాడ: Banswada | సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. అక్రమ సంబంధాలు, డబ్బులు, కుటుంబ తగాదాలతో ఇలా నిత్యం హత్యలు జరుగుతున్నాయి. స్వార్థం కోసం సొంత వారినే పొట్టన పెట్టుకుంటున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందనే ఆందోళన కలుగుతోంది. తాజాగా పింఛన్ డబ్బుల కోసం నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని(varni) మండలంలో గురువారం చోటు చేసుకుంది.
ఎస్సై మహేష్ (SI Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం జలాల్పూర్ (jalalpur) గ్రామానికి చెందిన మక్కపల్లి సాయవ్వ(57)తో కొడుకు సాయిలు పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంతో కుర్చీతో కొట్టి.. బండరాయితో తల, చాతి, పొట్టపై దాడిచేసి పారిపోయాడు. స్థానికులు ఆమెను 108 అంబులెన్స్‌లో బోధన్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయవ్వ చెల్లెలి కొడుకు జట్టి మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.