ePaper
More
    HomeతెలంగాణHyderabad | తండ్రిని చంపి సెకండ్​ షో సినిమాకు వెళ్లిన కూతురు

    Hyderabad | తండ్రిని చంపి సెకండ్​ షో సినిమాకు వెళ్లిన కూతురు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కన్న వారిని, కట్టుకున్న వారిని కడతేర్చడానికి కూడా ఆలోచించడం లేదు. తాత్కాలిక సుఖాలు, ఆనందాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు కడుపును బిడ్డలను కూడా చంపుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది. అనంతరం సెకండ్​ షో సినిమా (Second Show Movie)కు వెళ్లొచ్చి.. మృతదేహాన్ని చెరువులో పడేసింది.

    Hyderabad | భర్త వదిలేయడంతో..

    హైదరాబాద్​(Hyderabad)లోని ముషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన తండ్రిని ఓ యువతి ప్రియుడితో కలిసి హతమార్చింది. ముషీరాబాద్ (Musheerabad)​కు చెందిన మనీషా(25)కు గతంలోనే వివాహం అయింది. అయితే ఆమె జావీద్​ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను వదిలేశాడు. అయినా జావీద్​తో మనీషా సంబంధం కొనసాగిస్తోంది. ఇది నచ్చని ఆమె తండ్రి వడ్లూరి లింగం(45) కూతురిని మందలించి ఇంటికి రమ్మన్నాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడని మనీషా తండ్రిపై పగ పెంచుకుంది.

    READ ALSO  MLA Raja Singh | బీజేపీ కీలక నిర్ణయం.. రాజాసింగ్​ రాజీనామా ఆమోదం

    Hyderabad | కల్లులో మత్తు మందు కలిపి..

    తన తండ్రిని చంపడానికి మనీషా ఆమె ప్రియుడు జావిద్ ​ తన తల్లితో కలిసి పథకం పన్నింది. ఇందులో భాగంగా కల్లులో మత్తు మందు కలిపి లింగంకు ఇచ్చారు. ఆయన తాగి పడుకోగానే.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం తన ప్రియుడితో కలిసి మనీషా సెకండ్​ షో సినిమాకు వెళ్లారు. సినిమా నుంచి వచ్చాక లింగం మృతదేహాన్ని ఘట్‌కేసర్‌ ఏదులాబాద్‌ చెరువు(Ghatkesar Edulabad Lake)లో పడేశారు. చెరువులో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు మనీషా ఆమె ప్రియుడు జావీద్​, తల్లి శారదను అదుపులోకి తీసుకున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు.

    Hyderabad | సమాజం ఎటు పోతుంది

    ఇటీవల చోటు చేసుకుంటున్న పలు ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ప్రేమ, వివాహేతర సంబంధాలతో కొందరు హత్య చేస్తున్నారు. ఇటీవల జీడిమెట్లలో ఓ పదో తరగతి బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించిన విషయం తెలిసిందే. గద్వాల్​కు చెందిన తేజేశ్వర్​ అనే సర్వేయర్​ను ఆమె భార్య పెళ్లైన నెల రోజులకు ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఇటీవల ఓ మహిళా మద్యం మత్తులో తన ఐదు నెలల కూతురును చంపేసింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.

    READ ALSO  Governor Jishnu Dev Varma | ప్రతిజిల్లాలో రక్తనిల్వలు ఉండేలా చర్యలు తీసుకోండి: రాష్ట్ర గవర్నర్​

    Latest articles

    MLC Kavitha | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this