అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bank Recruitment | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్(Probationary officer), మేనేజ్‌మెంట్ ట్క్రెనీ పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్(IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి 11 బ్యాంకుల్లో 5,208 ఖాళీలను (Bank jobs) భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు ఈనెల 21 వరకు ఉంది. నోటిఫికేషన్ వివరాలు..
పోస్టులు: ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ(Management trainee)
బ్యాంకుల వారీగా పోస్టుల వివరాలు..
బ్యాంక్ ఆఫ్ బరోడా : 1000
బ్యాంక్ ఆఫ్ ఇండియా : 700
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : 1000
కెనరా బ్యాంక్ : 1000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 500
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ : 450
పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 200
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ : 358
విద్యార్హత: ఏదైనా డిగ్రీ(Any degree).
వయో పరిమితి : జూలై ఒకటో తేదీనాటికి 20 ఏళ్లు నిండి, 30 ఏళ్లు దాటనివారు అర్హులు. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
వేతన శ్రేణి : రూ.48,400 నుంచి రూ.85,920 నెలకు (అలవెన్సులు అదనం).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది : ఈనెల 21.
వచ్చేనెలలో ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: మూడు దశలలో ఉంటుంది.
ముందుగా ప్రిలిమినరీ పరీక్ష(Preliminary Test) నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు 30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు.
రెండో దశలో మెయిన్(Main) ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టిట్ టైప్ ప్రశ్నలకు 200 మార్కులు, డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.
చివరి దశలో ఇంటర్వ్యూ(Interview) నిర్వహిస్తారు. మొత్తం మార్కులు 100. ఇందులో క్వాలిఫై కావడానికి జనరల్ అభ్యర్థులు 40 శాతం, రిజర్వేషన్ల వారికి 35 శాతం అవసరం.
మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టిట్, డిస్క్రిప్టివ్ టెస్ట్‌లలో సాధించిన మార్కులతోపాటు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక ఉంటుంది. ఇందులో మెయిన్ పరీక్ష మార్కులకు 80 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు, నోటిఫికేషన్ పూర్తి వివరాలకు https://www.ibps.in లో సంప్రదించాలి.