Kamareddy SP | విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు.. ఎస్పీ
Kamareddy SP | విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు.. ఎస్పీ

అక్షరటుడే, ఎల్లారెడ్డి: District SP | విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర kamareddy SP Rajesh Chandra అన్నారు. లింగంపేట పోలీస్ స్టేషన్​ను Lingampeta police station సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్​లో పెండింగ్ కేసులపై pending cases ఆరా తీశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆన్​లైన్​ గేమ్స్​లో online games విద్యావంతులే అధికంగా మోసపోతున్నారని, చదువుకున్న వారే educated people ఆన్​లైన్​ గేమ్స్​కు online games అలవాటు పడడం విస్మయానికి గురిచేస్తోందని ఆయన అన్నారు. అక్రమంగా గంజాయి, అల్ప్రాజోలం ganja and alprazolam తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కల్తీకల్లు, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు Yellareddy DSP Srinivasa Rao, ఎస్సై వెంకట్రావు SI Venkat Rao తదితరులు ఉన్నారు.