అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం ధరలు (Gold price) ఒకరోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉన్నాయి. గత కొన్ని రోజులు ఈ పరిస్థితి చూస్తూనే ఉన్నారు. కాగా.. గురువారం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (India Bullion and Jewelers Association – IBJA) వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం (24-carat gold) 10 గ్రాముల ధర రూ.98,170గా ఉండగా, అదే 22 క్యారెట్ల(22-carat gold) ధర రూ.89,990 వద్ద కొనసాగుతోంది.
అలాగే వెండి ధర కూడా కొద్దిగా పడిపోయింది. ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ.1,09,900గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.600, 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 మేర తగ్గడం కాస్త ఉపశమనం కలిగించింది. అయితే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 98, 320కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 90,140గా ఉంది.
Today Gold Price : హైదరాబాద్‌లో…
హైదరాబాద్, విజయవాడ నగరాల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం Gold ధర రూ. 98, 170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 89,990కి చేరింది. ముంబయిలో రూ. 98,180, రూ. 89,990గా ఉంది.
ఇక ఇతర ప్రధాన నగరాలలో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) చూస్తే.. వడోదరలో రూ. 98,220, రూ. 90,040గా ఉంది. కోల్‌కతాలో రూ. 98,180, రూ. 89,990, చెన్నైలో రూ. 98,180, రూ. 89,990, బెంగళూరులో రూ. 98,180, రూ. 89,990, కేరళKerala లో రూ. 98,180, రూ. 89,990, పుణెలో రూ. 98,180, రూ. 89,990గా నమోదైంది.
Today Gold Price : ప్రధాన నగరాల్లో..
ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే.. హైదరాబాద్‌లో Hyderabad రూ. 1,20,100, విజయవాడ(Vijayawada)లో రూ. 1,20,100, ఢిల్లీలో రూ. 1,09,900, చెన్నైChennaiలో రూ. 1,19,900, కోల్‌కతాలో రూ. 1,19,900, కేరళలో రూ. 1, 19, 900, ముంబయిMumbaiలో రూ. 1,09,900, బెంగళూరులో రూ. 1,09,900, వడోదరలో రూ. 1,09,900, అహ్మదాబాద్‌లో రూ. 1,09,900గా ఉంది. డాలర్ బలపడితే, ఇతర కరెన్సీల వినియోగదారులకు బంగారం ఖరీదుగా అనిపిస్తుంది. ఈ ప్రభావం వల్ల బంగారం డిమాండ్ తగ్గి ధరలు తగ్గవచ్చు.
ప్రస్తుతం బంగారం ధరలు కొంత మేర తగ్గినప్పటికీ, ఇది తాత్కాలికమని నిపుణుల అంచనా. రాబోయే రోజుల్లో ధరలు రూ.99,000 నుంచి రూ.1 లక్ష మధ్య ఉండే అవకాశం ఉంది.కొంతమంది నిపుణులు మాత్రం ధరలు రూ.95,000 – రూ.1 లక్ష మధ్య స్థిరంగా ఉండొచ్చని అంటున్నారు.