ePaper
More
    HomeతెలంగాణCollector Praveenya | సింప్లిసిటీకి నిదర్శనం.. బాలికలతో నేలపై భోజనం చేసిన కలెక్టర్​ ప్రావీణ్య

    Collector Praveenya | సింప్లిసిటీకి నిదర్శనం.. బాలికలతో నేలపై భోజనం చేసిన కలెక్టర్​ ప్రావీణ్య

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collector Praveenya : సంగారెడ్డి (Sangareddy collector) కలెక్టర్ ప్రావీణ్య తాజాగా జహీరాబాద్​ మండలంలో (Zaheerabad mandal) పర్యటించారు. హోతిలోని కస్తూర్బా బాలికల పాఠశాలను (Kasturba Girls School) (KGBV) సందర్శించారు. వంటగది, ఆహార నాణ్యత, స్టోర్ రూమ్​ను పరిశీలించారు. వీటితో పాటు తరగతి గదిలో కూర్చుని బోధనా విధానాన్ని పర్యవేక్షించారు. అనంతరం బాలికలతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు.

    Collector Praveenya : గతంలో..

    2016 ఐఏఎస్​ బ్యాచ్​కు చెందిన ప్రావీణ్య​ సింప్లిసిటీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ఈమె గత నెల(జూన్ 13న​) సంగారెడ్డి కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు హనుమకొండ​ కలెక్టర్​గా విధులు నిర్వర్తించారు. కాగా, ప్రావీణ్య తాజాగా బాలికలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన ఫొటో నెట్టింట వైరల్​ అవుతోంది. ఆమె సింప్లిసిటీని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

    READ ALSO  MGM Hospital | చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నాడు.. ఎంజీఎం ఆస్పత్రి ఘటనలో ట్విస్ట్​

    ఒక జిల్లా పాలనాధికారి సాధారణ మహిళగా వ్యవహరించడంపై నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆమె పాలసీని అభినందిస్తున్నారు. కలెక్టర్​ ప్రావీణ్య పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల.. వారిలో మనోధైర్యం, ప్రేరణ కలిగిస్తాయని పేర్కొంటున్నారు. ఆమె వినయం, నిబద్ధతకు సెల్యూట్​ కొడుతున్నారు.

    నెట్టింట వైరల్​ అవుతున్న ఫొటోను పరిశీలిస్తే.. అందులో కలెక్టర్​ ప్రావీణ్య తన పక్కన కూర్చున్న బాలికతో ముచ్చటిస్తున్నట్లు ఉంది. ఒక కలెక్టర్​ పక్కనే కూర్చుని, భోజనం చేస్తూ.. ముచ్చటిస్తుండటం అబ్బురంగా ఉందంటున్నారు పలువురు.

    సాధారణంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (Kasturba Ganghi balikala Vidyalayam) నిరుపేద, నా అంటూ ఎవరూ లేని అభాగ్య బాలికలు చదువుతుంటారు. ఇలాంటి వారు నిరాదరణకు గురవుతుంటారు. అలాంటి వారితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య భోజనం చేయడం వల్ల.. వారిలో ఆత్మన్యూనతా భావం పోయి, ప్రేరణ కలుగుతుందని చెబుతున్నారు.

    READ ALSO  Fourth City | ఫోర్త్​ సిటీ నుంచి అమరావతికి ఎక్స్​ప్రెస్​ హైవే

    Latest articles

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు...

    More like this