అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చర్చకు రావాలని కేసీఆర్, కేటీఆర్‌కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) సవాల్ స్వీకరించి మంగళవారం ఉదయం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
తమ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ జీరో అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తన తండ్రి కేసీఆర్ (KCR) సీటిస్తే కేటీఆర్ డైరెక్ట్‌గా ఎమ్మెల్యే అయ్యాడన్నారు. తాము ఎన్నో వ్యయప్రయాసలతో రాజకీయ నేతలం అయ్యామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తమ అనుభవాల ముందు కేటీఆర్ జీరో అన్నారు.
Jagga Reddy | మీ మాటలను బట్టి స్పందన
బీఆర్ఎస్ నేతల మాటలను బట్టి తమ స్పందన ఉంటుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎంను గోకుడు ఎందుకు.. తన్నిపిచ్చుకోవడం ఎందుకు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని విమర్శించారు. తన తండ్రి సీటిస్తే ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌కు రాజకీయాల్లో కష్టానష్టాలు ఎలా తెలుస్తాయన్నారు.
Jagga Reddy | నోరు తెరిస్తే అబద్ధాలే..
కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే అని జగ్గారెడ్డి అన్నారు. పదేళ్లు అధికారం అనుభవించిన కేటీఆర్ 18 నెలలు అధికారం లేకపోవడంతో ఒడ్డున పడ్డ చేపపిల్లల కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలకు తమకు అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమను ఒక మాట అంటే పది మాటలు అంటామని హెచ్చరించారు. సీఎంను దూషించడం ఆపేస్తే, ప్రతి విమర్శలు ఆపేస్తామన్నారు.