అక్షరటుడే, వెబ్డెస్క్: Mobile Artillery Tests | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయంతో ఉత్సాహంగా ఉన్న భారతదేశం.. కీలకమైన రక్షణ ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్న అనేక రక్షణ కొనుగోళ్ల ప్రతిపాదనలను మళ్లీ పట్టాలెక్కిస్తోంది. దేశీయంగా తయారైన మొబైల్ ఆర్టిలరీ గన్ పరీక్షలు(Mobile Artillery Gun Tests) నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. థార్ ఎడారి నుంచి సియాచిన్ హిమానీనదం వరకు సవాలుతో కూడిన భౌగోళిక ప్రాంతాలలో మొబైల్ ఆర్టిలరీలను విస్తరించే అవకాశముంది.
Mobile Artillery Tests | అత్యంత కచ్చితత్వంతో..
‘అడ్వాన్స్ డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్’ (ATAGS) గా పేరొందిన ఈ మొబైల్ ఆర్టిలరీ అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ ను ఛేదిస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన మొబైల్ ఆర్టిలరీ ఇదేనని డీఆర్ డీవో(DRDO) చెబుతోంది. పగలే కాదు, రాత్రి సమయంలోనూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో కాల్చేయగలవు. అధునాతన ఆప్ట్రానిక్స్ తో ఉన్న ఆర్టిలరీ గన్ వ్యవస్థను ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష్యాలపై దాడి చేయొచ్చని డీఆర్ డీవో వివరించింది.
Mobile Artillery Tests | దశాబ్ద కాలం తర్వాత..
వాస్తవానికి మొబైల్ ఆర్టీలరీ ప్రాజెక్టుకు 2012లోనే అనుమతి లభించింది. దీనికి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఆర్ డీఈ)ను డీఆర్ డీవో నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ మొబైల్ ఆర్టిలరీని అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యుత్తమంగా పని చేస్తుందని, అత్యంత కచ్చితత్వంతో టార్గెట్ పై దాడి చేస్తుందని ఏఆర్ డీఈ చీఫ్ ఎ. రాజు(ARDE Chief A. Raju) వివరించారు. ప్రైవేట్ భాగస్వాములతో కలిసి డీఆర్ డీవో మొబైల్ ఆర్టిలరీని అభివృద్ధి చేసింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(Tata Advanced Systems) కీలకమైన ప్రైవేట్ భాగస్వాములలో ఒకటి. “ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిజైన్, విశ్లేషణలో భవిష్యత్ సాంకేతికతలను కలుపుకొని స్వదేశీ 155/52mm టోవ్డ్ గన్ను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి ఎంపికైన సంస్థల్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఒకటి. ‘‘155/52mm క్యాలిబర్ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ప్రోగ్రామ్ వినియోగదారు అవసరాలను తీర్చడానికి మెరుగైన పనితీరు ప్రదర్శించడానికి వివిధ టెక్నాలజీల ఎంపిక దోహదం చేస్తుందని ”అని కంపెనీ తన వెబ్సైట్లో ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ పేర్కొంది.