అక్షరటుడే, వెబ్డెస్క్: Bhadrachalam Temple | దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది. కొందరు ఆలయ భూములను యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవడానికి వెళ్తున్న అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా భద్రాచలం ఈవో రమాదేవి(Bhadrachalam EO Ramadevi)పై కొందరు దాడి చేశారు.
ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)లోని అల్లూరి జిల్లా పురుషోత్తపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి సంబంధించిన 889.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. ఆ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇటీవల ఏపీ హైకోర్టు(High Court) తీర్పు చెప్పింది. అయినా ఆక్రమణదారులు మాత్రం నిర్మాణాలు చేపట్టారు.
Bhadrachalam Temple | మూకుమ్మడిగా దాడి
పురుషోత్తపట్నం(Purushottapatnam)లోని ఆలయ భూముల్లో నిర్మాణాల విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. నిర్మాణాలను అడ్డుకునే యత్నం చేశారు. అయితే స్థానికులు ఈవోతో పాటు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఈవో స్పృహ తప్పి పోడిపోయారు. దీంతో సిబ్బంది వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.