అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్య (CP Sai chaitanya) సిబ్బందికి సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో (Police Headquarters) మెగా వైద్యశిబిరాన్ని (Mega medical camp) మంగళవారం సీపీ ప్రారంభించారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మల్లారెడ్డి, నారాయణ ఆస్పత్రుల నిర్వాహకులు శిబిరాన్ని నిర్వహించారు.
CP Sai chaitanya | ఆరోగ్య నియమాలు పాటించాలి
పోలీస్‌శాఖలో సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్య నియమాలు పాటించాలని సీపీ సూచించారు. పోలీసులు విధి నిర్వహణలో ఉంటూ ఆరోగ్యపై శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరాల నిర్వహణ అభినందనీయన్నారు.
కార్యక్రమంలో ఏసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి (ACP Baswareddy), ఏసీపీ (ఎఆర్) రాం చందర్ రావు, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి (ACP Rajavenkat reddy), పి.శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ (అడ్మిన్), శేఖర్ బాబు (ఎంటీవో), తిరుపతి (వెల్ఫేర్), సతీష్ (హోంగార్డ్స్), పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ సరళ, వైద్యులు సుధాకర్‌రావు, చంద్రమోహన్, వంశీ, ఆఫ్రిన్, నిఖిత, షహభాజ్ హైమద్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా పాల్గొన్నారు.

వైద్య శిబిరానికి హాజరైన పోలీసు సిబ్బంది