అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | యూఎస్ సుంకాల అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంతో ఇన్వెస్టర్లు బై ఆన్ డిప్స్(Buy on dips), సెల్ ఆన్ రైస్ పాలసీని అమలు చేస్తున్నారు. కనిష్టాల మధ్య కొనుగోళ్లతో మద్దతు ఇస్తున్న ఇన్వెస్టర్లు.. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుంటుండడంతో సెన్సెక్స్, నిఫ్టీ(NIfty) 50 ట్రేడింగ్ రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 55 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ (Stock Market) దిశ స్పష్టంగా లేకపోవడంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సెన్సెక్స్(Sensex) 83,320 నుంచి 83,561పాయింట్ల మధ్య, నిఫ్టీ 23,424 నుంచి 23,495 పాయింట్ల మధ్య కదలాడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్(Japan), దక్షిణ కొరియా వంటి కీలకమైన ఆసియా ఆర్థిక వ్యవస్థలతో సహా 14 దేశాల నుంచి దిగుమతులపై అదనపు సుంకాలను విధించారు. ఇవి వచ్చేనెల ఒకటో తేదీనుంచి అమలులోకి రానున్నాయి. అమెరికా, భారతదేశం మధ్య ఒప్పందం ఏ విధంగా ఉంటుందోనన్న అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల చర్యలు మార్కెట్‌ను భయపెడుతున్నాయి. అయితే ట్రంప్ అదనపు సుంకాలు విధించిన దేశాల జాబితాలో భారత్ లేకపోవడం, ట్రేడ్ డీల్(Trade deal)కు దగ్గరగా ఉన్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మన మార్కెట్లు స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి.
Stock Market | మిశ్రమంగా సూచీలు
ఫార్మా, కన్జూమర్ డ్యూరెబుల్ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా.. ప్రైవేట్ బ్యాంక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. బీఎస్‌ఈలో బ్యాంకెక్స్ 0.63 శాతం పెరగ్గా.. ఐటీ 0.30 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.25 శాతం లాభాలతో ఉన్నాయి. కన్జూమర్ డ్యూరెబుల్ సూచీ 1.72 శాతం నష్టాలతో ఉండగా.. హెల్త్‌కేర్(Healthcare) సూచీ 1.03 శాతం, ఆటో 0.61 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.58 శాతం నష్టాలతో సాగుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం, మిడ్ క్యాప్ 0.40 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో 12 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. కొటక్ బ్యాంక్ 3.30 శాతం, ఎటర్నల్ 1.39 శాతం, బీఈఎల్ 1 శాతం, ఎన్టీపీసీ 0.95 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.79 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers:టైటాన్ 5.45 శాతం, ట్రెంట్ 1.88 శాతం, సన్‌ఫార్మా 1.02 శాతం, మారుతి 0.81 శాతం, ఎయిర్‌టెల్ 0.69 శాతం నష్టాలతో ఉన్నాయి.