అక్షరటుడే, వెబ్‌డెస్క్: GGH Superintendent | నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్‌గా డాక్టర్ పి కృష్ణ మాలకొండ రెడ్డి (Krishna Malakonda Reddy) నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ (Christina Z. Chongtu) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను, వైద్య కాలేజీకి ప్రిన్సిపాల్‌ను నియమించారు.
గతంలో జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ప్రతిమారాజ్ కొనసాగారు. ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో జనవరిలో ఆమెను ప్రభుత్వం తొలగించింది. సూపరింటెండెంట్ బాధ్యతలు డాక్టర్ శ్రీనివాస్‌కు అప్పగించింది. తాజాగా ఉస్మానియా మెడికల్ (OMC) కాలేజీలో కార్డియాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కృష్ణ మాలకొండ రెడ్డిని జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమించింది.
GGH Superintendent | వైద్య కాలేజీ ప్రిన్సిపాల్‌గా కృష్ణమోహన్
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ (Medical College Principal)గా కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ శివప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కృష్ణమోహన్ తర్వలో బాధ్యతలు స్వీకరించనున్నారు.