ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​RRB Notification | రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. టెక్నీషియన్‌ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    RRB Notification | రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. టెక్నీషియన్‌ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నవారికి ఆర్‌ఆర్‌బీ(RRB) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టెక్నీషియన్‌ గ్రేడ్‌–1 సిగ్నల్‌, గ్రేడ్‌–3 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 28వ తేదీ వరకు గడువుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(Railway Recruitment Board)ల ద్వారా సుమారు 6 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

    RRB Notification | నోటిఫికేషన్‌ వివరాలు..

    భర్తీ చేసే పోస్టులు: మొత్తం : 6,238
    టెక్నిషియన్‌ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ : 183
    టెక్నిషియన్‌ గ్రేడ్‌ 3 : 6,055

    అర్హతలు: గ్రేడ్‌ 1 సిగ్నల్‌: డిప్లొమా/ఎస్సీ/ బీఈ/బీటెక్‌(ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌)
    గ్రేడ్‌ 3: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి, ఐటీఐ (ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, మెకానిక్‌, టర్నర్‌, పెయింటర్‌, డీజిల్‌ మెకానిక్‌, మెకట్రానిక్స్‌ ట్రేడ్స్‌)

    READ ALSO  New Schools | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 571 పాఠశాలలు

    వయోపరిమితి (జూలై 1, 2025 నాటికి):
    గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు.. : 18 నుంచి 33 ఏళ్లు.
    గ్రేడ్‌ 3: 18 నుంచి 30 ఏళ్లు
    ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

    వేతనం:గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు.. : రూ. 29,200 (లెవెల్‌ 5)
    గ్రేడ్‌ 3 పోస్టులకు : రూ. 19,900 (లెవెల్‌ 2)

    ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(Computer Based Test) ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు (గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టులకు వేరువేరుగా సీబీటీ ఉంటుంది). వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల గడువు ఇస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంది. సీబీటీ(CBT)లో సత్తా చాటినవారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టులు ఉంటాయి.

    READ ALSO  Government Employees | ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. నాలుగు శాతం డీఏ పెంపుతో పెర‌గ‌నున్న జీతాలు

    అర్హత మార్కులు: అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరి, ఈడబ్ల్యూఎస్‌(EWS) అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ, ఎస్సీలు 30 శాతం, ఎస్టీలు 25 శాతం మార్కులు సాధించాలి.

    ముఖ్య తేదీలు:దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: ఈనెల 28.
    ఫీజు చెల్లింపునకు చివరి తేది: ఈనెల 30.
    దరఖాస్తుల సవరణకు అవకాశం : వచ్చేనెల ఒకటో తేదీనుంచి 10వ తేదీ వరకు..
    పూర్తి వివరాలకు ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌(వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in)ను పరిశీలించగలరు.

    Read all the Latest News on Aksharatoday.in

    Latest articles

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే పనులు...

    More like this

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...