అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | తెలంగాణలో రాజకీయాలు సవాళ్లు.. ప్రతిసవాళ్లతో హీటెక్కాయి. ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం (Hyderabad LB Stadium)లో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్ ఎవరు వస్తారో రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ స్వీకరించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తను చర్చకు సిద్ధమని ప్రకటించారు. అంతేగాకుండా జులై 8న (మంగళవరం) సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సవాల్ చేశారు.
KTR | ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరిన కేటీఆర్
ప్రెస్‌క్లబ్‌కు రావాలని కేటీఆర్(KTR) సవాల్ చేయడంపై ఇటీవల మంత్రులు స్పందించారు. ప్రెస్‌క్లబ్‌లో కాదు.. అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు. అయితే కేటీఆర్ మాత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు బయలు దేరారు. ముందుగా తెలంగాణ భవన్(Telangana Bhavan) చేరుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
KTR | ప్రెస్‌క్లబ్‌కు బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కేటీఆర్ సవాల్ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ప్రెస్‌క్లబ్‌కు చేరుకుంటున్నాయి. రైతుల సంక్షేమంపై చర్చకు రావాలని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాము అసెంబ్లీలో చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLA) అసెంబ్లీకి చేరుకుంటున్నారు. సమస్యలపై చర్చించాల్సింది ప్రెస్‌క్లబ్‌లో కాదని.. అసెంబ్లీలో అని వారు అంటున్నారు. కాగా.. తాము మంత్రులతో సైతం చర్చకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.
KTR | మోసపూరిత పాలన
రాష్ట్రంలో 18 నెలలుగా మోసపూరిత పాలన సాగుతోందని కేటీఆర్ అన్నారు. ఆయన తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు హామీలతో రైతులను మోసం చేశారన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరు..పెట్టినా తమకు మైక్ ఇవ్వరని ఆరోపించారుర. అభివృద్ధిపై చర్చకు రావాలని ఎన్నోసార్లు కోరామన్నారు.గతంలో రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సవాల్ విసిరి మాట తప్పడం రేవంత్‌కు అలవాటే అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ స్వీకరిచి సోమాజిగూడ వెళ్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. మంత్రులెవరైనా వస్తారేమో చూస్తామన్నారు. మంత్రులతో అయినా చర్చకు తాము సిద్ధం అని కేటీఆర్ ప్రకటించారు. కాగా కేటీఆర్ సవాల్ నేపథ్యంలో ప్రెస్‌క్లబ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read all the Latest News on Aksharatoday.in