అక్షరటుడే, వెబ్డెస్క్: Padmanabha Swamy Temple | కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో అనూహ్య ఉదంతం చోటుచేసుకుంది. గుజరాత్(Gujrath)కు చెందిన సురేంద్ర షా (66) అనే వ్యక్తి, సీక్రెట్ కెమెరాలు అమర్చిన స్మార్ట్ కళ్లద్దాలను ధరించి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా, ఆలయ భద్రతా సిబ్బంది(Temple Security Staff) అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సురేంద్ర షా తన భార్య, సోదరి మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనానికి వచ్చారు. అయితే, ఆయన ధరించిన కళ్లద్దాల్లో అనుమానాస్పదంగా కెమెరాలు ఉన్నట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే స్పందించారు.
Padmanabha Swamy Temple | కళ్లద్దాలలో కెమెరాలు..
ఎంట్రన్స్ వద్దనే అతడిని అడ్డుకుని, కళ్లద్దాలను పరిశీలించగా అందులో చూపుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కెమెరాలు అమర్చబడినట్టు గుర్తించారు. ఈ చర్యలు ఆలయ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపిన భద్రతా సిబ్బంది, విషయం పోలీసులకు తెలిపారు. పోలీసులు సురేంద్ర షాపై భారతీయ న్యాయసంహిత (BNS) సెక్షన్ 223, ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం కింద కేసు నమోదు చేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో అతడికి దురుద్దేశ్యం లేదని భావించిన పోలీసులు, అతనిని కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలానికి పంపించారు. అయితే, విచారణ కొనసాగనున్న నేపథ్యంలో మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
గత నెలలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయం(Padmanabha Swamy Temple)లో 270 ఏళ్ల తర్వాత జరిగిన మహా కుంభాభిషేకం(Maha Kumbha Abhishekam) సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే 300 ఏళ్ల పాత విశ్వక్సేనుడి విగ్రహ పునఃప్రతిష్ఠ మరియు తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయం(Thiruvambadi Sri Krishna Temple)లో అష్టబంధ కలశ వంటి శ్రద్ధాభక్తులతో కూడిన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సంఘటన నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేయబోతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. భక్తులు ఆలయ నియమాలను గౌరవించాలని అధికారులు కోరుతున్నారు.
Read all the Latest News on Aksharatoday.in