అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పారుతున్నాయి. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. మహారాష్ట్ర(Maharashtra)లోని విదర్బలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విదర్బాకు సరిహద్దులో గల ఉత్తర తెలంగాణ (North Telangana)లో కూడా వానలు దంచి కొట్టే అవకాశం ఉంది.
పశ్చిమ తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో గత రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు వర్షాలు అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. సాయంత్రం, రాత్రిపూట వర్షం పడుతుంది. మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.
Heavy Rains | మరో రెండు రోజులు
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో వానల దంచి కొడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో వర్షాల ధాటికి 73 మంది మృతి చెందారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా మంది గల్లంతయ్యారు. రూ.వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్ర (Maharashtra)లో సైతం కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో నాసిక్‌లో ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది.
Heavy Rains | జోరుగా వరి నాట్లు
రాష్ట్రంలో కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో వరి నాట్లు జోరందుకున్నాయి. అన్నదాతలు (Farmers) పొలం పనుల్లో బిజీ అయిపోయారు. అయితే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. వర్షాలతో అందరు రైతులు ఒకేసారి వరినాట్లు ప్రారంభించడంతో కూలీలు దొరకడం లేదు. పలు ప్రాంతాల్లో బీహార్ నుంచి వలస కూలీలు రావడంతో కొంత ఊరట లభించినా.. చాలా ప్రాంతాల్లో కూలీలు దొరక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరా పొలం నాటు వేయడానికి కూలీలు రూ.5 వేల వరకు గుత్తాకు తీసుకుంటున్నారు.