ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. యూఎస్‌ మార్కెట్లు నెగెటివ్‌గా ట్రేడ్‌ అవగా.. యూరోప్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ముగిశాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)జపాన్‌, సౌత్‌ కొరియాతోపాటు పలు దేశాలపై అదనపు సుంకాలను విధించారు. దీంతో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) భారీగా నష్టపోయింది. ఇదే సమయంలో వాణిజ్య చర్చలకు తలుపులు తెరిచి ఉంచామన్న యూఎస్‌ ప్రకటనతో జపాన్‌, కొరియా మార్కెట్లు మాత్రం లాభాలతో ట్రేడ్‌ అవుతుండడం గమనార్హం.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌(Nasdaq) 0.92 శాతం నష్టపోగా.. ఎస్‌అండ్‌పీ 0.79 శాతం పడిపోయింది. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.03 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    READ ALSO  Travel Food Services | పబ్లిక్‌ ఇష్యూకు ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్.. రేపే సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌(DAX) 1.19 శాతం, సీఏసీ 0.35 శాతం పెరిగాయి. ఎఫ్‌టీఎస్‌ఈ 0.19 శాతం నష్టంతో ముగిసింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం పాజిటివ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8.15 గంటల సమయంలో కోస్పీ(Kospi) 1.14 శాతం, హంగ్‌సెంగ్‌ 0.63 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.55 శాతం, నిక్కీ 0.31 శాతం, షాంఘై 0.22 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.81 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.06 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐ(FII)లు అమ్మకాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఐదు ట్రేడిరగ్‌ సెషన్ల తర్వాత సోమవారం నికర కొనుగోలుదారులుగా నిలిచారు. వారునికరంగా రూ. 321 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు నికరంగా రూ. 1,853 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.93 నుంచి 0.95 కి పెరిగింది. విక్స్‌(VIX) 1.99 శాతం పెరిగి 12.56 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 9.20 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 46 పైసలు బలహీనపడి 85.86 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.38 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.32 వద్ద కొనసాగుతున్నాయి.
    READ ALSO  Pre Market Analysis | వియత్నాంతో యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌.. పరుగులు తీసిన వాల్‌స్ట్రీట్‌..

    భారత్‌, అమెరికాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఈ రోజు ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో ఈ రోజు కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Latest articles

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    More like this

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...