అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : ఇటీవలి కాలంలో భౌగోళికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆల్‌టైమ్ గరిష్టాలను తాకిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు కొంతవరకు దిగివస్తున్నాయి. గత నెలలో రూ. లక్షను దాటిన బంగారం ధరలు ఇప్పుడు రూ.98వేల లోపు ఉన్నాయి. జూలై 8న బంగారం ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల బంగారం Gold (10 గ్రాములకు) రూ.98,280 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) రూ.90,090గా నమోదైంది. నిన్నటితో పోల్చితే తులం బంగారం ధర దాదాపు రూ.400 మేర తగ్గినట్లు గమనించవచ్చు. మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.
Today Gold Price : ధరలు ఎలా ఉన్నాయంటే..
పండుగలు, శుభకార్యాల సమయాల్లో నగల దుకాణాలు మహిళలతో కిటకిటలాడుతుంటాయి. అయితే ఇటీవలి ధరల పెరుగుదల కొనుగోలు మీద కొంత ప్రభావం చూపింది. ఇప్పుడు ధరలు కొద్దిగా తగ్గడంతో మళ్లీ కొనుగోళ్ల దిశగా ప్రజలు అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో, వెండి ధరలు కిలోకు రూ.1,09,900 వద్ద స్థిరంగా ఉంది.
ఆయా ప్రాంతాలలో బంగారం ధరలు చూస్తే.. చెన్నై (Chennai)లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090గా నమోదైంది. ముంబై 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 కాగా, ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,430, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,240గా ట్రేడ్ అయింది.
ఇక హైదరాబాద్‌లో (Hyderabad) 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల ధర 98,280, ఉండగా.. 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల ధర 90,090గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,090, బెంగళూరు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,280 , ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,090 , కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,280 , ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,090 ఉంది.
బంగారం కొనాలని అనుకునే వారు కాస్త తగ్గినప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం. రానున్న రోజులలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.