అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాదు శ్రద్ధనంద్ గంజ్ గుమస్తా సంఘం (Shradhanand Ganj Gumasta Sangam) ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా లాండేరి బాల అంజయ్య (బాలు) విజయం సాధించారు. ప్రత్యర్థి కొక్కు నర్సయ్యపై 134 ఓట్ల తేడాతో గెలుపొందారు. గతంలో బాలు కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్బంగా పలువురు వ్యాపారస్తులు బాలుకు స్వీట్లు తినిపించారు. అలాగే కార్యదర్శిగా గట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా వెంకటి విజయం సాధించారు.
