అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Kagar | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్ నెలకొంది. అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో సోదాలు చేస్తున్నారు. తాడ్వాయి, కరకగూడెం, కిన్నెరసాని అడవుల్లో సైతం సెర్చ్ ఆపరేషన్(Search Operation) కొనసాగుతోంది. గిరిజన గ్రామాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో 2026 మార్చి 31 వరకు మావోయిస్టులు(Maoists) లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రతి వర్షాకాలంలో మావోలు రెస్ట్ తీసుకుంటారని.. అయితే ఈ సారి వారికి నిద్ర లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్(Operation Kagar)లో భాగంగా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
సాధారణంగా వానాకాలంలో అడవుల్లో వాగులు, నదులు పారుతాయి. చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి దట్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో బలగాలకు కూంబింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉండవు. దీంతో ప్రతి ఏటా మావోయిస్టులు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని రెస్ట్ తీసుకునే వారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో సైతం ఆపరేషన్ కగార్ కొనసాగించి మావోల ఆట కట్టిస్తామని అమిత్ షా(Amit Shah) ప్రకటించారు. ఇందులో భాగంగా నిత్యం అడవులను జల్లెడ పడుతున్నారు.
Operation Kagar | కర్రెగుట్టల్లో తనిఖీలు మరవక ముందే..
తెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) సరిహద్దులో గల కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఏప్రిల్‌లో వేల సంఖ్యలో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల బంకర్లను బలగాలు గుర్తించి, ధ్వంసం చేశాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా భద్రాద్రి ఏజెన్సీలో మావోయిస్టుల కోసం కూంబింగ్(Coombing) చేపడుతుండడం గమనార్హం.