అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Drunk and Drive Tests | హైదరాబాద్ నగరంలో మందుబాబులు పెరిగిపోతున్నారు. నగరంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్లో జాలీగా పెగ్గేసి ఇళ్లకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే అలాంటి వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్(Drunk and Drive) తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో శని, ఆదివారాల్లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 627 మంది మందుబాబులు దొరికారు. ఇందులో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు ఉండడం గమనార్హం. మందుబాబులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
Drunk and Drive Tests | జైలుశిక్ష వేస్తున్న మారనితీరు
డ్రంకన్ డ్రైవ్ కేసులో గతంలో జరిమానా మాత్రమే వేసేవారు. అయితే ప్రస్తుతం కోర్టులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే వారికి జైలు శిక్ష కూడా విధిస్తున్నాయి. మద్యం మోతాదును బట్టి జైలు శిక్ష వేస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అంతేగాకుండా భారీ జరిమానాలు సైతం విధిస్తున్నాయి.
Drunk and Drive Tests | ప్రమాదాలకు కారణం
దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు డ్రంకన్ డ్రైవ్‌తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా యువత మద్యం తాగి రోడ్డుపై అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.