ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Indian Navy | పదో తరగతితో నేవీలో ఉద్యోగావకాశాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

    Indian Navy | పదో తరగతితో నేవీలో ఉద్యోగావకాశాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Navy | ఇండియన్‌ నేవీ(Indian navy)లో సివిలియన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. 1,100 ఖాళీల భర్తీకోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. పదో తరగతి(10th class)నుంచి డిగ్రీ పూర్తి చేసినవారి వరకు వారి అర్హతను బట్టి ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ఈనెల 18తో ముగియనుంది.

    పోస్టులు: సివీలియన్‌ మోటార్‌ డ్రైవర్‌ ఆర్డినరీ గ్రేడ్‌, ఎంటీఎస్‌(MTS), ట్రేడ్స్‌మన్‌ మేట్‌, చార్జ్‌మన్‌, సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మన్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(Multi tasking staff), స్టోర్‌ సూపరింటెండెంట్‌, ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ ఆర్టిస్ట్‌, కెమరామన్‌, ఫైర్‌ ఇంజిన్‌ డ్రైవర్‌, స్టోర్‌ కీపర్‌(Store keeper) పోస్టులను భర్తీ చేయనున్నారు.

    అర్హతలు: 10వ తరగతి(10th Class), 12వ తరగతి, ఇంజినీరింగ్‌ లేదా ఇతర విభాగాలలో డిప్లొమా(Diploma) లేదా డిగ్రీ, ఐటీఐ నుంచి డిప్లొమా అండ్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు పూర్తి చేసినవారు అర్హులు. పోస్ట్‌ను బట్టి 18 నుంచి 45 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవాలి.

    READ ALSO  New Schools | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 571 పాఠశాలలు

    దరఖాస్తులు: ఆసక్తిగలవారు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేసి, అప్లికేషన్‌ ఫీజును సైతం ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. జనరల్‌(General), ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 295 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ బీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు(Women candidates) ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుంది.

    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(Computer Based Test) ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత పోస్ట్‌లను బట్టి నైపుణ్య పరీక్ష ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర వివరాల కోసం ఐఎన్‌సీఈటీ (ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

    READ ALSO  F-35 Stealth Jet | ఎగుర‌లేని స్థితిలో ఎఫ్‌-35 స్టెల్త్ జెట్.. విమానాన్ని విడి భాగాలుగా చేసి త‌ర‌లించే యోచ‌న‌

    Read all the Latest News on Aksharatoday

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this