ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Old City | హైదరాబాద్​లో ఇరాన్​ సుప్రీం లీడర్​ పోస్టర్ల కలకలం

    Old City | హైదరాబాద్​లో ఇరాన్​ సుప్రీం లీడర్​ పోస్టర్ల కలకలం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Old City | హైదరాబాద్​ (Hyderabad)లోని పాతబస్తీలో ఇరాన్​ సుప్రీం లీడర్ (Iran Supreme Leader)​ అయుతుల్లా ఖమేనీ పోస్టర్లు కలకలం రేపాయి. ఖమేనీతో పాటు హిజ్బుల్లా నెంబర్ 2 హసన్ నస్రల్లా ఫొటోలతో పాతబస్తీలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటీవల ఇజ్రాయెల్​–ఇరాన్​ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

    ఆపరేషన్​ రైజింగ్​ లయన్ (Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్ (Israel)​ ఇరాన్​లోని అణుస్థావరాలపై దాడులకు పాల్పడింది. అనంతరం ఇరాన్​ సైతం ఇజ్రాయెల్​పై ప్రతిదాడులు చేసింది. యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో అమెరికా (America) సైతం ఎంటర్​ అయి బంకర్​ బస్టర్లతో ఇరాన్​లోని అణు స్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం ఇరాన్​–ఇజ్రాయెల్​ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఈ యుద్ధంలో భారత్​ తటస్థ వైఖరి తీసుకుంది. ఏ దేశానికి మద్దతు తెలపకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

    READ ALSO  Kharge Meeting | స్థానిక పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్​.. కాసేపట్లో రాష్ట్రానికి ఖర్గే

    Old City | భారీ బందోబస్తు

    భారత్​ తటస్థ వైఖరి తీసుకున్నా.. కాంగ్రెస్​తో పాటు పలు విపక్షాలు యుద్ధం విషయంలో ఇజ్రాయెల్​ వైఖరిని తప్పుపట్టాయి. ఇరాన్​ ఇస్లాం దేశం కావడంతో ఇక్కడి ముస్లింలు కూడా టెల్​అవీవ్​ దాడులను ఖండించారు. తాజాగా ఖమేనీకి మద్దతుగా ఓల్డ్​ సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటవడం గమనార్హం. డబీర్ పుర, దారుల్షిప్పాలో పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఆదివారం మొహర్రం (Moharram) వేడుకల సందర్భంగా పాతబస్తీలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

    Latest articles

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ వహించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    More like this