ePaper
More
    HomeజాతీయంSocial Media Accounts | ఇండియాలో రాయిట‌ర్స్ అకౌంట్ బ్లాక్.. ఇందులో త‌మ జోక్యం లేద‌న్న...

    Social Media Accounts | ఇండియాలో రాయిట‌ర్స్ అకౌంట్ బ్లాక్.. ఇందులో త‌మ జోక్యం లేద‌న్న కేంద్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Social Media Accounts | అంత‌ర్జాతీయ వార్తా సంస్థ రాయిట‌ర్స్ (International news agency Reuters) సోష‌ల్ మీడియా ఖాతాను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘X’ బ్లాక్ చేసింది. అయితే, కేంద్ర‌ ప్ర‌భుత్వ‌మే బ్లాక్ చేయించింద‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. ఈ వివాదంపై ప్ర‌భుత్వం స్పందించింది. రాయిటర్స్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయమని ‘X’కి ఎటువంటి చట్టపరమైన అభ్యర్థనను జారీ చేయలేదని కేంద్రం ఆదివారం స్ప‌ష్టం చేసింది.

    “చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా” రాయిటర్స్ ‘X’ హ్యాండిల్ బ్లాక్ చేసిన‌ట్లు పేర్కొంటూ ఒక సందేశాన్ని ప్రదర్శించిన కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే కేంద్రం స్పందించింది. “రాయిటర్స్ హ్యాండిల్‌ను నిలిపివేయాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి (Government of India) లేదు. సమస్యను పరిష్కరించడానికి మేము ‘X’తో నిరంతరం పని చేస్తున్నాము” అని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) అధికారిక ప్రతినిధి వెల్ల‌డించారు.

    READ ALSO  National Medical Commission scam | నేషనల్ మెడికల్ కమిషన్ స్కాం కేసులో కీలక పరిణామం

    Social Media Accounts | వివ‌ర‌ణ కోరిన ప్ర‌భుత్వం..

    రాయిటర్స్ హ్యాండిల్ బ్లాక్ చేసిన ఉదంతంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ‘X’ నిర్వాహ‌కుల‌ను ఆదేశించింది. ఖాతాను బ్లాక్ చేయ‌మ‌ని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేద‌ని, అయినా ఇచ్చిన‌ట్లు పేర్కొన‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. అదే స‌మ‌యంలో రాయిటర్స్ హ్యాండిల్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించింది.

    “ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) సమయంలో మే 7న ఒక ఉత్తర్వు జారీ చేశాం. కానీ అది అమలు కాలేదు. ‘X’ ఇప్పుడు ఆ ఉత్తర్వును అమలు చేసినట్లు కనిపిస్తోంది, ఇది వారి వైపు నుంచి తప్పు. ప్రభుత్వం దానిని త్వరగా పరిష్కరించడానికి ‘X’ని సంప్రదించింది” అని అధికారిక వర్గాలు తెలిపాయి.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this