అక్షరటుడే, ఇందూరు: Ura Panduga | ఆషాఢమాసంలో (Ashada Masam) భాగంగా ఇందూరులో ఈ నెల 13వ తేదీన (ఆదివారం) ఊరపండుగ నిర్వహించనున్నట్లు సర్వ సమాజ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. నగరంలోని సిర్నాపల్లి గడిలో (Sirnapalli Gadi) పండుగ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఊర పండుగను పురస్కరించుకొని నగరంలోని ఖిల్లా చౌరస్తా(Killa Chowrastha) నుంచి పెద్దబజార్ (Pedd bazar), ఆర్య సమాజ్(Arya Samaj), గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. మరో గ్రామ దేవత దుబ్బ వైపు తరలి వెళ్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని అన్ని కుల సంఘాల సభ్యులు పండుగలో పాలు పంచుకుంటారని.. గురువారం బండారు వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాము, ఆదె ప్రవీణ్, కమిటీలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.